'క‌లైజ్ఞ‌ర్' తోపాటు నాస్తిక‌వాదానికి ఖ‌న‌నం!

Update: 2018-08-09 13:18 GMT
కొద్ది సంవ‌త్స‌రాల క్రితం త‌మిళ నాట ఉవ్వెత్తున ఎగ‌సిన‌ ద్ర‌విడ ఉద్య‌మంలో `క‌లైజ్ఞ‌ర్`క‌రుణానిధి కీల‌క‌మైన పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. క‌రుడుగ‌ట్టిన నాస్తికుడిగా పేరు గ‌డించిన క‌రుణా నిధి.....త‌న వారిని కూడా నాస్తికులుగా మారాల‌ని కోరిన సంద‌ర్భాలూ ఉన్నాయి. అయితే, క‌రుణ బ్రతికున్న‌పుడే....ఆయ‌ను సొంత కుటుంబ స‌భ్యులే ఆ నాస్తిక వాదాన్ని న‌మ్మ‌క‌పోవ‌డం వేరే విష‌యం. అయితే, నిన్న జ‌రిగిన క‌రుణానిధి అంత్యక్రియ‌లలో ఆయ‌న నాస్తిక‌వాదం కూడా స‌మాధి అయిపోయింది. దేవుడు లేడ‌ని....జంతువులా పుట్టిన మ‌నిషి...మ‌ట్టిలోనే క‌లిసి పోతాడ‌ని న‌మ్మిన క‌రుణానిధిని....ఆయ‌న కుటుంబ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ మెరీనా బీచ్ లోనే ఖ‌న‌నం చేయించారు. గాంధేయవాదులు - కాంగ్రెస్ వాదులైన మాజీ సీఎం సమాధుల మ‌ధ్య నాస్తికుడైన క‌రుణానిధి ఉండ‌లేర‌ని డీఎంకే కార్య‌క‌ర్తలు కూడా బెట్టు చేయ‌డం విశేషం.

అయితే, చాలా మంది నాస్తికుల కుటుంబంలో చాలా మంది ఆస్తికులుంటారు. క‌రుణ కూడా అందుకు మిన‌హాయింపు కాదు. వాస్త‌వానికి క‌రుణ వంటి నాస్తిక‌వాది ఖ‌న‌నం ఎక్క‌డ జ‌రిగినా పెద్దప‌ట్టింపు లేదు. హైకోర్టు లో పిటిష‌న్లున్న‌ నేప‌థ్యంలో కరుణ అంత్యక్రియలు వేరే చోట నిర్వ‌హించాల‌ని సీఎం ప‌ళ‌ని సూచించారు. అయితే, స్టాలిన్ - క‌రుణ అనుచ‌రులు మాత్రం మెరీనా బీచ్ లోనే అంత్య‌క్రియ‌లు జరగాలని మొండిప‌ట్టు ప‌ట్టారు.కాంగ్రెస్ వాదుల మ‌ధ్య కరుణ ఉండ‌లేర‌ని.....అన్నా సమాధి ఉన్న మెరీనాలోనే  ఖననం చేశారు. ఓ ర‌కంగా ...క‌రుణానిధి కుటుంబీకులు - అనుచ‌రులు .... పోటీపడి మ‌రీ ఆస్తిక సెంటిమెంటును అమ‌లు చేశారు. చ‌నిపోయిన క‌రుణానిధి నాస్తికవాదాన్ని...గౌర‌వించ‌క‌పోగా....క‌రుణ‌తో పాటే దానిని ఖ‌న‌నం చేశారు.
Tags:    

Similar News