ఫైజర్ వ్యాక్సిన్ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్స్ సంస్థ ఫైజర్ .. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లలో ఫైజర్ వ్యాక్సిన్ అత్యుత్తమమైందని.. సైడ్ఎఫెక్ట్స్ లేకుండా మెరుగైన ఫలితాలు ఇవ్వగల వ్యాక్సిన్ ఇదొక్కటే నని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. మరోవైపు యూరప్, ఇజ్రాయెల్, కెనడా సహా అనేక దేశాలు ఈ వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్లు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఫైజర్ వ్యాక్సిన్ పనితీరుపై ప్రస్తుతం కొంత గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే అమెరికాలో వ్యాక్సినేషన్ మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
తొలిదశలో వైద్యశాఖ సిబ్బంది. 70 ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ఇటీవల శాన్‌డియాగోలోని ఆసుపత్రిలో మాథ్యూ డబ్ల్యూ అనే నర్సుకు ఈ నెల 18వ తేదీన ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. చలి, జ్వరం, దగ్గు వచ్చాయి. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ నర్సుకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
దీంతో వ్యాక్సిన్ తీసుకున్న నర్సుకు పాజిటివ్ రావడం ఏమిటని ఆందోళన నెలకొన్నది. అయితే ఈ ఫైజర్ వ్యాక్సిన్‌ను రెండు డోసులుగా ఇస్తున్నారు. సదరు నర్సుకు రెండు డోసులు ఇచ్చారో తెలియదు. అయితే ఇప్పటివరకు లక్షల సంఖ్యలో వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. అయితే ఈ వ్యాక్సిన్ పని తీరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు అంటున్నారు.