మోడల్ అంటే ఫేమస్ అవ్వాలి.. ఫేమస్ అవ్వాలంటే ఫొటో షూట్స్ కంపల్సరీ. ఇందుకోసం కొందరు మోడ్రన్ డ్రస్సు ట్రై చేస్తే.. మరికొందరు డ్రెస్ తీసేసి స్కిన్ షో చేస్తుంటారు. అందరిలా చేస్తే తానెలా ఫేమస్ అవుతానని భావించిందో ఏమోగానీ.. అమెరికాకు చెందిన ఓ యువతి మాత్రం మోస్ట్ డేంజరస్ ఫొటో షూట్ కు ప్లాన్ వేసింది!
పెన్సిల్వేనియాకు చెందిన 25 ఏళ్ల అమైరీస్ రోజ్ గత డిసెంబర్‌లో హాలీడేస్‌కు జాంబియా వెళ్లింది. అక్కడ ప్రపంచంలోనే అత్యంత పొడవైన విక్టోరియా జలపాతం వద్దకు వెళ్లింది. డెవిల్స్ పూల్‌గా పేరుగాంచిన ఈ జలపాతాన్ని చూసిన ఈ అమ్మడు అక్కడ ఫొటో షూట్ చేయాలని డిసైడ్ అయ్యింది. అయితే.. జలపాతం కింద అనుకుంటున్నారేమో.. 1640 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు నేలమీదకు దూకుతున్న అంచుమీదకు వెళ్లి, అక్కడ నీటిపై పడుకొని ఫొటోలకు ఫోజిచ్చిందీ మోడల్.
ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది రోజ్. వీటికి "అంచుల్లో జీవితం.. ఇక్కడ చాలా బాగుంది" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఆ పోస్టు మరోసారి వైరల్ అవుతోంది. అయితే.. ఆమె చేసిన పనిని కొందరు ‘వావ్’ అంటూ పొగిడినా.. మిగలినవారంతా ఏకి పారేస్తున్నారు. బిల్డప్ కోసం చూసుకుంటే జీవితాన్నే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విమర్శిస్తున్నారు. 'ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది' అని కొందరు అంటుంటే.. 'ఫాలోవర్లను సంపాదించుకోవడం కోసం ఇలాంటి పిచ్చిపనులు అవసరమా' అని నిందిస్తున్నారు.
ఈ విమర్శలపై అమైరీస్ స్పందిస్తూ.. 'ఫొటోషూట్ చాలా ప్రశాంతంగా, జాగ్రత్తగా జరిగింది. నేను అస్సలు భయపడలేదు. పైగా జలపాలతం అంచున ఉండటం నాకు భలే కిక్కొచ్చింది' అని రిప్లీ ఇవ్వడం గమనార్హం. అయినప్పటికీ.. ఆమె ఫీట్ ను ఖండిస్తున్నారు చాలా మంది.
అయితే.. ఆమెను మెచ్చుకునేవారు మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ‘అంత ఎత్తులో ఉండే వాటర్ ఫాల్స్ చిట్టచివరకు వెళ్లడమంటే మాటలు కాదు. దానికి దమ్ముండాలి’ అంటూ ఆమె సాహసాన్ని ప్రశంసిస్తున్నారు. పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి ఇదేనేమో కదా..!