చంద్రబాబు పర్యటనను వదలని జేబుదొంగ.. ఏం చేశాడో తెలుసా?

Update: 2022-07-23 16:30 GMT
దొంగలకు తమ పర బేధం లేదు. పర్సులో ఎంత ఉంది అనేదే ముఖ్యం. బడాబాబుల పర్సులు అయితే ఇంకా డబ్బులు ఎక్కువగా ఉంటాయి. సందడిగా ఉన్న వేళ సడేమియాలా ఎంట్రీ ఇచ్చి కాజేస్తుంటారు. చంద్రబాబు వరద బాధితుల కోసం ఆత్రుతగా పర్యటిస్తే ఆయన బిజీ పర్యటనలో నేతల జేబులు కొట్టేశారు దొంగలు

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను దొంగలు వదలలేదు. ఏకంగా ఓ మాజీ మంత్రికే కన్నం వేశారు. చంద్రబాబు, ఇతర పార్టీ నేతలతో కలిసి ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

వరద బాధిత ప్రజలను పరామర్శిస్తూ చంద్రబాబు, నేతలు బిజీగా ఉండగా..  దొంగలు మాత్రం తమ పని తాము చేసుకుపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

చంద్రబాబు పర్యటనలో ఊహించని ఘటనకు నేతలు షాక్ తిన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో ఓ జేబు దొంగ తన చేతివాటం చూపించాడు. ఏకంగా మాజీ మంత్రి పర్సునే కొట్టేశాడు. చంద్రబాబు వెంట ఉన్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు జేబులోంచి ఓ దొంగ పర్సును కొట్టేశాడు.

ఆ పర్సులో రూ.35వేల నగదుతోపాటు 2 ఏటీఎం కార్డులు కూడా ఉన్నాయట.. అంతేగాక.. 17000 విలువ చేసే విదేశీ కరెన్స్ కూడా పోయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గొల్లపల్లి సూర్యారావు రాజోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  మాజీ మంత్రి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను చంద్రబాబు సహా టీడీపీ నేతలు పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. బాధిత ప్రజలను కలిసి వారికి అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు పర్యటనలో ఇలాటి ఉపద్రవాలు ఇంతకుముందు కూడా చోటుచేసుకున్నాయి. టీడీపీ నేతల పర్యటనలో పడవ బోల్తా పడడంతో పలువురు నేతలు నీటిలో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Tags:    

Similar News