పీలేరు ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి.. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సహా ఆయన కుటుంబంపై ఓ రేంజ్‌లో ఫైరైపోయారు. నల్లారి సోదరుడి నోటి దురుసు వ్యాఖ్యలపై అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. నల్లారి కుటుంబీకులను ఐదు ఎన్నికల్లో ఓడించిన ఘనత తన కుటుంబానికే చెందుతుందని చెప్పారు.నల్లారి, ఆయన సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి సహా ఆయన అన్న, తండ్రి, తల్లిని ఓడించిన తాము దద్దమ్మలమా అని విరుచుకుపడ్డారు. నల్లారి కుటుంబీకులు ఎన్నికలలో గెలిచినా, ఓడినా వారి అడ్రస్ హైదరాబాదేనని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేది తానేనని అన్నారు.
పీలేరులో జరిగిన వైసీపీ నవరత్నాల సభలో చింతల మాట్లాడారు. నల్లారి కుటుంబీకులు పీలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, సీఎంగా ఉన్న వ్యక్తి రేంజ్‌లో చేయాల్సిన అభివృద్ధి కాదని అన్నారు. వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి నిధులతో 130 గ్రామాలలో నీటి సమస్యను పరిష్కరించినట్టు చెప్పారు. గత ఎన్నికల తరువాత నియోజకవర్గానికి మూడున్నర సంవత్సరాలు దూరంగా హైదరాబాద్‌లో విలాసజీవితం గడుపుతున్న నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గ పర్యటన పేరుతో ఎంపీ, ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరేందుకు తహతహలాడుతూ చంద్రబాబు ఇంటి వద్ద పడి గాపులు కాస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మెప్పు పొందేందుకే తనను, ఎంపీని అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ చేపట్టనున్న పాదయాత్రలో పీలేరు నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తారని ఎంపీ మిధున్‌రెడ్డి చెప్పారు. నీరు ప్రగతి పథకం టీడీపీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నదని ఆరోపించారు. మొత్తంగా మాజీ సీఎం సోదరుడుకి చింతల అదిరే రేంజ్‌లో కౌంటర్ ఇవ్వడంపై వైసీపీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది.