రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పిల్లి సుభాశ్ చంద్రబోస్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కానున్నాడు. అయితే ఆయనకు మొదటి నుంచి కలిసొస్తోంది. గతంలో వైఎస్సార్ కుటుంబంతో ఉన్న సన్నిహిత్యంతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా నియమితులయ్యారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక కాగా తాజాగా రాజ్యసభ సభకు వెళ్లనున్నారు. అయితే రాజ్యసభకు వెళ్తుండడంతో తన సొంతం ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో రాజకీయ జీవితం మొదలైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండడంతో 2004 - 2009లో రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు మంత్రిని చేశారు. అనంతరం రోశయ్య మంత్రివర్గంలో కూడా ఉన్నారు. అయితే వైఎస్సార్సీపీ స్థాపించిన అనంతరం మంత్రిగా ఉన్న బోస్ ఎమ్మెల్యే - మంత్రి పదవిని వదులుకుని ఆ పార్టీలో చేరిపోయారు. అయితే అప్పటి నుంచి సుభాష్ చంద్రబోస్ కు స్థానికంగా పరిణామాలు మారిపోయాయి. సొంత నియోజకవర్గం రామచంద్రపురంలో మూడుసార్లు ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2014 - 2019లో జరిగిన ఎన్నికల్లోనూ ఓడిపోయారు. అయినా తన కుటుంబానికి అత్యంత విధేయుడైన బోస్ ను జగన్ అతడికి పిలిచి మరి ఉప ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ అప్పగించారు. బీసీల్లోని శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన బోస్ ను ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తున్నారు.
ఓడినా పదవులు రావడం బోస్ కే కలిసొచ్చింది. అదే ఆయన ప్రత్యర్థులకు కంటగింపుగా మారింది. పేరుకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా అతడి వ్యవహారాన్ని స్థానికంగా సొంత పార్టీ వైఎస్సార్సీపీ నాయకులే తప్పుబడుతున్నారు. అతడి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శాసనమండలి రద్దవుతున్న సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న అతడు ఆ పదవి కోల్పోనున్నాడు. ఈ క్రమంలో బోస్ ను రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు ఆయన కేవలం ఢిల్లీ రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతాడని - స్థానికంగా అంత ప్రభావం చూపకపోవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం భావిస్తోంది. అయితే చిరకాల ప్రత్యర్ధిగా ఉన్న రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీలోకి రావడంతో ఇప్పుడు బోస్ ను రాజ్యసభకు పంపించడంతో స్థానికంగా కొంత విబేధాలు తగ్గుతాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు.