అనేక ఆరోపణలు, కేసుల నేపథ్యంలో కోడెల ఆత్మహత్యకు పాల్పడటంతో రకరకాల చర్చలు దాని చుట్టూ జరుగుతున్నాయి. తెలుగుదేశం, వైసీపీ ఎవరి కోణంలో వారు స్పందిస్తున్నారు. అయితే... ముఖ్యమంత్రి జగన్ తో పాటు గడికోట శ్రీకాంత్ తదితరులు దీనిపై రాజకీయం వద్దన్నట్టు స్పందించారు. తమ సానుభూతిని తెలిపారు. కోడెలపై గెలిచిన అంబటి రాంబాబు కూడా కేసును దర్యాప్తు చేసి నిజాలు తేల్చలని డిమాండ్ చేశారు. కానీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం దీనిపై లోతుగా స్పందించారు.
మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ’’ఆయనపై ఆయన ఇంట్లో వారిపై కేసులు నమోదయ్యాయి. ఫర్నీచర్ దొంగతనం కింద నమోదైన కేసు కావచ్చు... కొడుకుల మీద నమోదైన కేసు కావచ్చు... ఆయన్ను కుంగదీసి ఉండొచ్చు. ఇంట్లో వివాదాలకు కారణమై డిప్రెషన్లోకి వెళ్లి ఉండొచ్చు. ఈ మానసిక భారం, అవమానంతో జనాలకు ముఖం చూపలేకే ఆయన కుంగిపోయి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్కు... ఏదైనా కానీ ఆయన మరణం దిగ్రాంతికరం. బాధాకరం. ఇంట్లో ఏం జరిగిందో, ఎక్కడ ఏం జరిగిందో అన్నీ బయటకు వస్తాయి. ఆయన తప్పులు ఈ దారుణానికి దారితీస్తే దానికి వైసీపీని బాధ్యురాలిని చేయడానికి ప్రయత్నిస్తూ రాజకీయం చేయడం తగదు. ఇది దురదృష్టం ఇది. ఆయన మరణానికి రాజకీయ వేధింపులు కారణం కాదు’’ అన్నారు.
క్యాన్సర్ ఆస్పత్రికెందుకెళ్లారు? బొత్స అనుమానం
ఇదిలా ఉంటే... కోడెల మరణం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కోడెల మరణంపై మీడియాలో రెండు మూడు రకాల వార్తలు రావడంపై ఆయన అనుమానాలు వ్యక్తంచేశారు. అందుకే ఘటన తెలంగాణలో జరగడంతో సమగ్ర విచారణ జరిపి నిజాలు తేల్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. వీలైనంత త్వరగా విచారణ జరపాలని, అంతలోపు సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని కోరారు. నిమ్స్, కేర్ వంటి సాధారణ ఆస్పత్రులకు కాకుండా క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లడంపై ఆయన అనుమానాలు వ్యక్తంచేశారు.