తోట ఎప్పుడైనా నాకు శత్రువే..డిప్యూటీ సీఎం క‌ల‌క‌లం..

Update: 2019-09-18 12:55 GMT
మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరినా నాకు ఆయ‌న శ‌త్రువే.. తోట త్రిమూర్తుల‌పై ఉన్న ద‌ళితుల శిరోముండనం కేసుపై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ స్ప‌ష్టం చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు త్వ‌ర‌లో టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఇప్పుడు వైసీపీలో పెద్ద వివాదం న‌డుస్తోంది. తోట త్రిమూర్తులుకు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌ కు రెండు ద‌శాబ్దాలుగా రాజ‌కీయ‌ వైరం కొన‌సాగుతుంది.

అయితే ఇప్పుడు తోట త్రిమూర్తులు  వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో గ‌తంలో ఆయ‌న‌పై వెంక‌టాయపాలెం శిరోముండనం కేసును మూసేస్తార‌నే ఆందోళ‌న‌లో ద‌ళితులు ఉన్నారు. దీంతో ద‌ళిత సంఘాల నాయ‌కులు - కార్య‌క‌ర్త‌లు - ప్ర‌జ‌లు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ రామచంద్రాపురం మండ‌లం ద్రాక్షారామంలో ప‌ర్య‌టన‌ను అడ్డుకుని నిర‌స‌న  తెలిపారు. దీంతో డిప్యూటీ సీఎం  పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ద‌ళిత సంఘాల నేత‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.

తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి వైసీపీలో చేరినా ఆయ‌న‌తో నాకు శ‌త్రుత్వ‌మే ఉంటుంద‌ని - వెంకటాయ‌పాలెం ద‌ళితుల శిరోముండనం కేసును ఎట్టిప‌రిస్థితుల్లోను ప్ర‌భుత్వం విడిచిపెట్ట‌ద‌ని భ‌రోసా ఇచ్చారు. వెంక‌టాయ‌పాలెం బాధితుల ప‌క్ష‌మే ప్ర‌భుత్వం నిలుస్తుంద‌ని - ద‌ళితులు ఎట్టి ప‌రిస్థితుల్లో ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని ఆయ‌న అభ‌యం ఇచ్చారు. తోట త్రిమూర్త‌లు నిన్న‌ - నేడు - రేపు నాకు శ‌త్రువే అని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశాడు. వైసీపీకి ద‌ళితులు వెన్నెముక‌గా ముందునుండి నిలుస్తున్నార‌ని, మీ మ‌ద్ద‌తును పార్టీ ఏనాటికి వ‌దులు కోద‌ని, అందుకే ఈ కేసులో ఎంత పెద్ద‌లు ఉన్నా వ‌దిలిపెట్టె ప్ర‌స‌క్తే లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యాల‌తో పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. తోట త్రిమూర్తులు వైసీపీలో చేరిన మూడు రోజుల‌కే డిప్యూటీ సీఎం ఇలా కామెంట్ చేస్తే భ‌విష్య‌త్తులో ఈ ఇద్దరి నేత‌ల వైరం ఎలా ఉంటుందో అనే ఆందోళ‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు - తోట త్రిమూర్తులు అభిమానుల్లో క‌లుగుతుంది.
Tags:    

Similar News