కేంద్ర విద్యుత్తు శాఖామంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. చంద్రబాబును పొగిడినట్లుగా కనిపించినప్పటికీ ఆయన మాటల్లోని శ్లేష పలు వాదనలకు తావిచ్చేలా ఉండటం గమనార్హం. తాజాగా ఆయనమాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో చంద్రబాబు మినహా మరే ముఖ్యమంత్రి తనతో భేటీ అయ్యేందుకు పెద్దగా ఆసక్తి ప్రదర్శించని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు సూపర్ యాక్టివ్ అంటూ ఆయన మెచ్చుకున్నారు. కేంద్రం నుంచి ఏపీకి ప్రయోజనాలు పొందే లక్ష్యంతో చంద్రబాబు తమతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంటారన్నారు.
విద్యుత్ రంగం విషయంలో తమ సర్కారు నూతన విధానాల్ని ప్రకటించిన పక్క రోజునే తమను సంప్రదించింది ఇద్దరు ముఖ్యమంత్రులే అన్న ఆయన.. ‘‘మమ్మల్ని ఇద్దరు ముఖ్యమంత్రులు సంప్రదించారు. వారిలో ఒకరు ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబు అయితే.. మరొకరు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరారాజె’’ అని చెప్పుకొచ్చారు.
విద్యుత్ రంగంలో ఏపీ దూసుకుపోతుందన్న పీయూష్.. తనకు నిత్యం కనెక్టివిటీలో ఉండే చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులు ఎందుకు కేటాయించనట్లు? తనకు ఏ మాత్రం టచ్ లో ఉండరంటూ దక్షిణాధి రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులపై విమర్శలు చేసిన పీయూష్ తాజాగా తెలంగాణ సర్కారు ఒప్పుకుంటే.. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పటం దేనికి నిదర్శనం? ఓ పక్క చంద్రబాబు నిత్యం టచ్ లో ఉంటున్నారని చెబుతూనే.. మరోవైపు తనకు టచ్ లో లేని తెలంగాణ సర్కారుకు తాయిలాలు ప్రకటించటం వెనుక మర్మం ఏమిటో పీయూష్ కే తెలియాలి.