పీకే(ఐప్యాక్‌) వ‌ర్సెస్ పీకే క‌న్స‌ల్టింగ్‌.. గొడ‌వ అదే!!

Update: 2022-05-04 10:30 GMT
రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్ ఉర‌ఫ్ పీకేకి చెందిన కంపెనీ..ఐప్యాక్‌. ఇది .. జాతీయ‌స్థాయిలో రాజ‌కీ య క‌న్స‌ల్టెన్సీగా ప‌నిచేస్తుంది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక‌, ఈ కంపెనీ.. ద్వారా మ‌నీ ట్రాన్సా క్ష‌న్స్ కూడా జ‌రుగుతున్నాయి. ఐప్యాక్‌లో చాలా మంది ప‌నిచేస్తున్నారు. పెద్ద పెద్ద యూనివ‌ర్సిటీల్లో చ‌దువుకొని రాజ‌కీయంగా ఆస‌క్తిగా వాళ్లు.. ఐప్యాక్‌లో చేరి.. మంచిగా డ‌బ్బులు సంపాదిస్తున్నారట‌.

ఇక‌, పీకే వ‌ల్ల గెలిచిన పార్టీ.. వాస్త‌వానికి పార్టీకి ఉన్న కేడ‌ర్ కార‌ణంగా గెలిచినా.. త‌ర్వాత‌.. క్రెడిట్‌మాత్రం పూర్తిగా.. పీకేకే వ‌స్తోంద‌ని కేడ‌ర్ అంటున్నారు. అయితే.. ఇవేవీ ప‌ట్టించుకోకుండా.. అంతా మా వ‌ల్లే.. సాధ్య‌మైంది.. మేంలేక‌పోతే.. మీకు విజ‌యం లేద‌ని.. పీకే.. ఐప్యాక్ చెబుతోంది.

అయితే..ఏపీలో ఎన్నిక‌లు అయిపోయిన త‌ర్వాత‌.. ఒక సంఘ‌ట‌న జ‌రిగిందంట‌. పీకే టీంలో ప‌నిచేసిన ఒక అత‌ని చేత‌.. హైక‌మాండ్‌లో ఉన్న ఒక పెద్ద మ‌న‌షి.. పీకే క‌న్ష‌ల్టింగ్ అని పేరు పెట్టి.. ఒక కంపెనీని రిజిస్ట‌ర్ చేయించి.. వాలంటీర్స్‌ను దానికి అనుసంధానం చేయించార‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. దీనికి సంబంధించి.. పార్టీ నుంచి డ‌బ్బులు కూడా తీసుకున్నార‌ని అంటున్నారు.

ఇక‌, వీరి డ్యూటీ ఎంటంటే.. వ‌లంటీర్స్ స‌రిగా ప‌నిచేస్తున్నారా?  లేదా.. అని ప‌ర్య‌వేక్షించాలి. వారిని చెక్ చేస్తూ.. ఉండాలి. ఇలా.. రాష్ట్రంలోని ప్ర‌తి మండ‌లానికి ఒక పీకే క‌న్స‌ల్టింగ్ నుంచి ఒక ప్ర‌తినిధిని నియ‌మించి.. ప‌నిచేయిస్తున్నార‌ని.. అంఉన్నారు. అయితే.. పీకేఐప్యాక్ వాళ్లు మాత్రం మా పేరు పెట్టుకుని ఏందుకు.. చేయాలి?  మీరు ఇంకొక పేరు పెట్టుకోవ‌చ్చు క‌దా? అని ఐప్యాక్ వాళ్ల వాద‌న‌.

ఈ మ‌ధ్య వైసీపీ కీల‌క స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా మాకు పీకే చేయడం లేదు.. అని ప్ర‌క‌టించారు. మొత్తానికి వైసీపీకి ఐప్యాక్ మ‌ధ్య ఏదో చిన్న గ్యాప్ వ‌చ్చింద‌ని అంటున్నారు. మ‌రి ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటారా.. లేక‌.. మాకు వ‌లంటీర్స్ స‌రిపోతారు. అని అంటారా? అనేదిచూడాలి.. అని వైసీపీవ‌ర్గాల వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News