జ‌గ‌న్‌తో ప్ర‌శాంత్ కిశోర్‌కు చెడిందా? ఎందుకు ఆ కామెంట్‌?!

Update: 2022-10-31 05:28 GMT
ఈరోజు ఏపీ ముఖ్య‌మంత్రిగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఉన్నారన్నా, 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్నార‌న్నా, 22 మంది లోక్‌స‌భ్యుల‌ను కైవ‌సం చేసుకున్నార‌న్నా.. దీనివెనుక రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ఉర‌ఫ్ పీకే ఉన్నారు. ఈ విష‌యాన్ని ఎవ‌రూ కాద‌నలేరు. 2014 ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత జ‌గ‌న్ 67 స్థానాల‌కే ప‌రిమితం అయ్యారు. ఇది ఆయ‌న‌కు అప్ప‌ట్లో గ‌ట్టి దెబ్బ‌గా వైసీపీ నాయ‌కులు భావించారు. రాష్ట్ర విడిపోయిన త‌ర్వాత వెంట‌నే ముఖ్య‌మంత్రి కావాల‌ని భావించిన జ‌గ‌న్‌కు ఇది తీవ్ర అవ‌మానంగా అనుకునేవార‌ని చ‌ర్చ కూడా సాగింది.

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త‌న ప్ర‌యోగాలు, త‌న వారి ప్ర‌యోగాల‌తో పార్టీ అధికారంలోకి వ‌చ్చే ఛాన్స్ లేద‌ని గ్ర‌హించి వెంట‌నే అప్ప‌టికి మంచి ఫాంలో ఉన్న వ్యూహ‌క‌ర్త  ప్ర‌శాంత్ కిశోర్‌ను సంప్ర‌దించారు. అప్ప‌టికే ఆయ‌న బీజేపీ త‌ర‌ఫున ప‌నిచేశారు. `చాయ్ పే చ‌ర్చ‌` వంటి వినూత్న ప్ర‌చారంతో గుజ‌రా త్ ముఖ్య‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర మోడీని ప్ర‌ధాని పీఠంపై కూర్చోబెట్టి భారీ విజ‌యాన్ని అందుకున్నారు పీకే. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ కూడా ఆయ‌న‌ను ఆశ్ర‌యించి, ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే పార్టీని ముందుకు న‌డిపించారు. ఈ డీల్ ఖ‌రీదు 350 కోట్ల‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం కూడా జ‌రిగింది.

అయితే, 2019 ఎన్నిక‌ల అఫిడవిట్‌లో వైసీపీ చేసిన ఎన్నిక‌ల ఖ‌ర్చును పేర్కొంటూ, పీకేకు 37.17 కోట్ల‌రూపాయ‌ల‌ను ఫీజుకింద ఇచ్చిన‌ట్టు జ‌గ‌న్ పేర్కొన్నారు. ఇక‌, పీకే చెప్పిన‌ట్టే న‌వ‌ర‌త్నాలు, పాద‌యాత్ర వంటివి చేసి  జ‌గ‌న్  గెయిన్ అయ్యారు. అంతేకాదు, సీఎం అయిన త‌ర్వాత జ‌గ‌న్ పీకే బృందానికి ఖ‌రీదైన కానుక‌లు కూడా ఇచ్చి సాగ‌నంపిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఫొటోలు కూడావ‌చ్చాయి. క‌ట్ చేస్తే.. సీఎం అయిన త‌ర్వాత పాల‌న ప్రారంభించిన త‌ర్వాత కూడా జ‌గ‌న్‌తో ఒక‌సారి అధికారికంగానేపీకే వ‌చ్చి తాడేప‌ల్లిలో భేటీ అయ్యారు. ఆ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల దూకుడుకు ఎలా అడ్డుక‌ట్ట‌వేయాల‌నే అంశంపైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు లీకులు వ‌చ్చాయి.

ఇక‌, ఇప్ప‌టికీ పీకే బృందం ఐప్యాక్‌తో జ‌గ‌న్ సావాసం చేస్తూనే ఉన్నారు. వారినే నియోజ‌క‌వ‌ర్గాల్లో తిప్పుతున్నారు. ఐప్యాక్ చెప్పిందే వేదంగా భావిస్తున్నారు. మ‌రి ఇంత‌గా పాలు తేనె మాదిరిగా క‌లిసిపోయిన పీకే-జ‌గ‌న్‌ల మ‌ధ్య ఇప్పుడు ఏం జ‌రిగింది?  అనేది చ‌ర్చ కు వ‌స్తోంది. ఎందుకంటే తాజాగా పీకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  ``జ‌గ‌న్‌కు సాయం చేసే క‌న్నా.. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్‌కుచేసి ఉంటే బాగుండేది``అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం జ‌న్ సురాజ్ పాద‌యాత్ర చేస్తున్న పీకే ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌కు సాయంపై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి జ‌గ‌న్‌కు పీకేకు ఏమైనా చెడిందా? అనేది ఇట్ర‌స్టింగ్‌గా మారింది. ఇన్నేళ్ల‌లో ఎప్పుడూ లేనిది ఇప్పుడు పీకే విరుచుకుప‌డ‌డం జ‌గ‌న్‌కు డ్యామేజీ అవ‌డం ఖాయ‌మ‌ని సంకేతాలు అందుతున్నాయి. ఇటీవ‌ల పీకే త‌న పాద‌యాత్ర‌కు నిధులు ఇస్తున్నది త‌న పాత క్ల‌యింట్లేన‌ని వ్యాఖ్యానించారు. వీరిలో ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా ఉన్నార‌ని చెప్పారు. అయితే, తాను అడినంత జ‌గ‌న్ ఇచ్చి ఉండ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇలా వ్యాఖ్యానించారా?  లేక‌, బీజేపీ వ్య‌తిరేకిస్తున్న త‌న‌కు మ‌ద్ద‌తుగా జ‌గ‌న్ ఒక్క ప్ర‌క‌ట‌నా చేయ‌క‌పోవ‌డం.. ఢిల్లీలో బీజేపీకి ప‌రోక్షంగా ఆయ‌న మ‌ద్ద‌తు ఇస్తున్నార‌నే భావ‌న పీకేకు ఉందా? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో పీకే వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News