ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకొని బీజేపీ విజయదుందుబీ మోగించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కొత్త ఉత్సాహాన్నిచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా 2024 తీర్పును ప్రజలు 2022లోనే వెలువరించినట్లు ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. అయితే, దీనిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం తర్వాత నిన్న ప్రధాని మోడీ ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 2024 తీర్పును ప్రజలు 2022లోనే వెలువరించినట్లు విశ్లేషించడంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలపై సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేసినవని అన్నారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు జనం ఆకర్షితులు కావొద్దని, తప్పుదోవ పట్టించే రీతిలో ఆ వ్యాఖ్యలు ఉన్నట్లు ప్రశాంత్ కిషోర్ తాజాగా తన ట్వీట్‌లో తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికల పోరు ఆ ఏడాదిలోనే డిసైడ్ అవుతుందని, కానీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఆధారంగా 2024ను నిర్ణయించలేరన్నారు. ఈ విషయం సాహెబ్‌కు తెలుసు అని, కానీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఆధారంగా తమ పార్టీ వైపు అందర్నీ మళ్లించేందుకు ప్రధాని ఓ తెలివైన ప్రయత్నం చేస్తున్నారని, ప్రతిపక్షాలపై నిర్ణయాత్మక సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పీకే ఆరోపించారు. కాగా, పీకే చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల విషయంలో ఆసక్తిగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సైతం భరోసా ఇచ్చేవని అంటున్నారు.
కాగా, ఎన్నికల ఫలితాలపై ప్రధాని స్పందిస్తూ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఇవాళే హోలీ మొదలైందన్నారు. మహిళలు, యువత ఓట్ల వల్లే బీజేపీకి ఇంత భారీ మెజారిటీ సాధ్యమైందని అభిప్రాయపడ్డారు.
ఐదు రాష్ట్రాల ప్రజల హృదయాలను చూరగొనేందుకు కార్యకర్తలు రాత్రి పగలన్న తేడా లేకుండా శ్రమించారన్న ప్రధాని.. వారికి కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీపై నమ్మకం పెరిగినందునే ప్రజలు తమకు ఓటు వేశారని ప్రధాని అన్నారు. గతంలో ప్రజలు కనీసావసరాల కోసం ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. పాలనలో పారదర్శకత తెచ్చి సుపరిపాలన అందించామని అన్నారు.