కరోనా గుడ్ న్యూస్: ఢిల్లీలో ప్లాస్మా థెరపీ సక్సెస్

Update: 2020-04-26 12:39 GMT
కరోనా వైరస్ పై దివ్యాస్త్రంగా పనిచేస్తున్న ‘ప్లాస్మా థెరపీ’ని భారత్ లో తొలిసారి ప్రయోగించారు. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. దీంతో కరోనాపై విజయం సాధ్యమైంది. ఇదో అపూర్వఘట్టంగా వైద్యులు అభివర్ణిస్తున్నారు.

తాజాగా ఢిల్లీలో 49 ఏళ్ల ఒక కరోనా సోకిన రోగికి ‘ప్లాస్మా థెరపీ’ చేశారు. ఈ చికిత్సకు అతడు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యాడు. దీంతో కరోనాపై ప్లాస్మా థెరపీ ఆయుధంలా పనిచేస్తుందని డాక్టర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈనెల 4న కరోనా రోగి ఆస్పత్రిలో చేరాడు. అతడి పరిస్థితి విషమించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. రోజురోజుకు పరిస్థితి క్షీణించింది. ఈ నెల 8న వెంటిలేటర్  అమర్చారు. రోగి కోలుకోక మరణానికి దగ్గరయ్యాడు. దీంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు వైద్యులు ప్లాస్మా థెరపీని ప్రారంభించారు. కరోనాను జయించిన వ్యక్తి నుంచి ప్లాస్మాను తీసి ఈనెల 14న రోగికి ఎక్కించారు. దీంతో కరోనాకు చెక్ పడి కోలుకున్నాడు. తాజాగా డిశ్చార్జి అయ్యాడు.  దీంతో దేశవ్యాప్తంగా ఈ చికిత్స చేయాలని కేంద్రం సూచించింది.


Tags:    

Similar News