ప్రధానిని హత్య చేస్తామంటూ మళ్లీ బెదిరింపు

Update: 2018-10-13 20:15 GMT
 కొద్దినెలల కిందట ప్రధాని మోదీని హత్య చేస్తామంటూ మావోయిస్టులు లేఖరాసిన విషయం సంచలనంగా మారడం.. ఆ నేపథ్యంలో హైదరాబాద్‌లో వరవరరావు వంటివారిని అరెస్టు చేయడం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ప్రధానిని హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడంతో భద్రతావర్గాలన్నీ అప్రమత్తమయ్యాయి. దిల్లీ పోలికే కమిషనర్ అమూల్య పట్నాయక్ కు ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపు లేఖను గుర్తు తెలియని వ్యక్తులు పంపారు.  ఈ బెదిరింపు లేఖలో 2019 నవంబర్ లో మోదీని చంపేస్తామంటూ వారు పేర్కొన్నట్టు సమాచారం.

కాగా వరుస బెదిరింపులతో ప్రధాని భద్రత విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెలలో మోదీ పలు ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తాజా మెయిల్ అస్సాం నుంచి వచ్చినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిసింది.

దేశంలోని పరిణామాలతో పాటు పాకిస్తాన్లో ప్రభుత్వం మారడం.. ఐఎస్ఐ చీఫ్ మారడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికలు ఉండడంతో ప్రధాని నిత్యం ప్రచారం కోసం తిరుగుతారు కాబట్టి ఇలాంటి హత్యా పథకాలకు అవకాశం ఉందని.. వాటిని ఎలాగైనా అడ్డుకోవాలని భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
Tags:    

Similar News