``మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన తరహాలోనే....ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు స్కెచ్ వేశారు. మావోలు నిర్వహిస్తున్న ఇంటర్నల్ కమ్యూనికేషన్ వ్యవస్థను పుణె పోలీసులు గుట్టురట్టు చేయడంతో మోడీ హత్య గురించి వేసిన ప్రణాళికలు తెలిశాయి.`` అంటూ ఓ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన ఆ లేఖను రాసినట్లు చెబుతున్న పోలీసులు రోడ్ షో సమయంలో మోడీని టార్గెట్ చేయడం ఉత్తమమనని మావోలు పక్కా ప్రణాళిక కూడా వేసుకున్నట్లుగా తేల్చారు. అయితే, దీని వెనుక ఉత్తప్రచారం కోణం ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రజాదరణ తగ్గుతోందన్న ఆందోళనలో భాగంగానే మోడీ ఈ హత్య నాటకానికి తెరలేరపారని దుయ్యబట్టింది.
మహారాష్ట్రలోని భీమా కోరేగాంలో ఈ ఏడాది జనవరిలో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో జాకబ్ విల్సన్ అనే వ్యక్తి ఇంటి నుంచి పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. మోడీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం వెలుగులోకి చూడటంతో మీడియా దానిపై ఫోకస్ చేసింది. అయితే ఈ పరిణామాన్ని కాంగ్రెస్ తేలికగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజయ్ నిరుపమ్ ఈ వార్తలపై స్పందిస్తూ...ప్రధాని ప్రాణానికి ముప్పు ఉందని వస్తున్న రిపోర్టులు పూర్తిగా అబద్దమని చెప్పలేమని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేస్తూనే...మోడీకి ఇలాంటి డ్రామాలు కొత్తకాదని ఎద్దేవా చేశారు. గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో కూడా ఇలానే ఆయన రాజకీయవ్యూహాలు వేశారని ఆరోపించారు. ప్రజాదరణ తగ్గుతోందన్న ఆందోళనలో భాగంగానే మోడీ ఈ హత్య నాటకానికి తెరలేపారని ఆరోపిస్తూ...ఇలాంటి వాటి ద్వారా ప్రజలను మోసం చేయలేరని కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు.
కాగా, పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా సైతం ప్రధాని ప్రాణాలకు ముప్పు తలపెట్టిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్ సంస్థ సభ్యుడు మౌలానా బాషిర్ అహ్మద్ ఖాకి శుక్రవారం జరిగిన ప్రార్థనల అనంతరం సమావేశంలో మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో.. జిహాదీ యుద్ధాన్ని ప్రకటించాలని పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని హతమారుస్తామని - ఆ తర్వాత భారత్ ను విచ్చిన్నం చేస్తామని పేర్కొన్నాడు. జిహాద్ కు రంజాన్ మంచి సమయం అని, జీహాదీలో ప్రాణాలు కోల్పోతే - స్వర్గానికి వెళ్తారని అన్నాడు. కశ్మీర్ లో భారత భద్రతా దళాలతో జమాత్ ఉద్ దవా సభ్యులు జిహాదీ కొనసాగిస్తున్నారని, కశ్మీర్ స్వేచ్ఛ కోసం, భారత్ ను నాశనం చేయాలన్న లక్ష్యంతో వాళ్లు పనిచేస్తున్నట్లు బాషర్ తెలిపాడు.