రూపాయి ఇవ్వరు.. మోడీతో మీటింగ్ పై సీఎంలలో అసహనం?
అమ్మా పెట్టదు.. అడుక్కుతిననివ్వదు అన్నట్టుంది మోడీ వ్యవహారమని దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు లోలోపల రగిలిపోతున్నారట.. కొత్తగా వచ్చిన ఏపీ సీఎం జగన్ బయటపడకపోయినప్పటికీ ఆయన లోపల మాత్రం ఇదే ఫీలింగ్ ఉండుంటుంది. కేసీఆర్ ఎలాగూ మోడీ సంస్కరణలు ఉట్టి గ్యాస్ అని ఇదివరకే కుండబద్దలు కొట్టాడు. అందుకే ఇప్పుడు మోడీ మరోసారి తాజాగా సీఎంలతో భేటికి రెడీ అయినా కూడా ఏ సీఎం కూడా మోడీతో సమావేశానికి ఆసక్తి చూపించడం లేదట..
రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టు.. రాష్ట్రాల సీఎంల ఆర్థిక కష్టాలు అంతా విని రూపాయి విదిల్చని మోడీ తీరుపై అన్ని రాష్ట్రాల సీఎంలు గుర్రుగా ఉన్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని చిప్ప చేతికి ఇచ్చిన మోడీ తీరుపై బెంగాల్, తెలంగాణ, కేరళ సీఎంలు బహిరంగంగానే విమర్శలు చేశారు.
ఇప్పుడు మరోసారి సీఎంల భేటికి మోడీ రెడీ అవుతున్నారు. ఈసారి తమ రాష్ట్రాల ఆర్థిక కష్టాలు ఏకరువు పెట్టడానికి అన్ని రాష్ట్రాల సీఎంలు రెడీ అయ్యారు. ఈసారి కేంద్రం సాయం చేస్తుందా లేదా అన్నదే ప్రధాన డిమాండ్ గా రాష్ట్రాల సీఎంలు కారాలు మిరియాలు నూరుతున్నారట..
మోడీ ఎజెండా మాత్రం మళ్లీ లాక్ డౌన్ పెట్టడానికే ఈ మీటింగ్ అంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నడిచేలా నిధులు ఇస్తేనే కేంద్రం సూచనలు పాటిస్తామని.. పైసా విదిల్చకుండా అన్నింటిని బంద్ చేయడం కుదరదని.. లాక్ డౌన్ పై సీఎంలు విముఖత వ్యక్తం చేస్తున్నారట.. ఇలా మోడీకి ఈసారి సీఎంల మీటింగ్ కత్తిమీద సాములా మారిందట.. సీఎంల నుంచి భారీగా సెగ తగులుతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.