కొట్లాట ముగిసింది. ఇక రిలాక్సే మిగిలింది. సుధీర్ఘమైన సార్వత్రిక ఎన్నికల సమరాన్ని నడి ఎండల్లో ఎదుర్కొన్న ప్రధాని నరేంద్రమోడీ ఎట్టకేలకు శనివారం సేదతీరారు. ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రంతో ముగియడంతో తన కిష్టమైన దైవభక్తిలో మునిగిపోయారు. దాదాపు 45 రోజుల ప్రచారం ముగియడంతో ఇక దేవుడా నువ్వే దిక్కు అని గెలిపించాలని ఆ శివుడిని మొక్కుకున్నట్టున్నాడు.
తాజాగా ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొనే ఈ ఆలయం సందర్శన చేశారు. అయితే కోడ్ కు విరుద్దంగా ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి వివాదం సృష్టించారు. మోడీ ఈసీ అనుమతితోనే పర్యటించినా అక్కడ అభివృద్ధి పనులపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం దుమారం రేపింది. కోడ్ ఈ నెల 19వరకు ఉన్నా మోడీ దానిని పట్టించుకోకపోవడం గమనార్హం.
ప్రచారం ముగిసింది. ప్రజలు ఓట్లేశారు. ఇక చేయాల్సిందీ ఏమీ లేదు. ఆ దేవుడిని తనను గెలిపించాలని కోరడం తప్ప.. ఇప్పుడు మోడీ అదే పనిలో బిజీగా ఉన్నారు. శనివారం ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జోలి గ్రాంట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి వాయుసేన హెలీక్యాప్టర్ లో కేదార్ నాథ్ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం గుడిచుట్టూ ప్రదక్షిణ చేశారు. గర్భగుడిలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. సాధారణంగా తెల్లటి పొలిటికల్ డ్రెస్సులు వేసుకొని దైవదర్శనం చేసుకునే మోడీ కేదార్ నాథ్ ఆలయానికి మాత్రం విచిత్ర డ్రెస్ కోడ్ తో రావడం ఆకట్టుకుంది. నెత్తిన టోపీ, మెడలో భారీ శాలువ, బ్లూకలర్ చోలా వేసుకొని నడుముకు ఎర్రటి కండువా చుట్టుకొని గుడిచుట్టు ప్రదక్షిణ చేశారు. మోడీ రాకను పురస్కరించుకొని ఆలయం ప్రదక్షిణ ప్రాంతంలో ఆలయ నిర్వాహకులు ఎర్రతివాచీ పరిచారు. రేపు కూడా మోడీ ఉత్తరాఖండ్ లోనే పర్యటించనున్నారు.
కాగా మోడీ రెండు రోజుల పాటు కేదార్ నాథ్ ఆలయం వద్దనే ఉండనున్నట్టు సమాచారం. ఆలయం వద్దనున్న గుహను సందర్శించి రాత్రంతా అక్కడే గుహలో నిద్రించనున్నట్టు తెలిసింది. గడిచిన నవంబర్ లో కూడా మోడీ కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సంవత్సరంలోనే రెండు సార్లు వచ్చారు. మొత్తంగా ప్రధానిగా నాలుగోసారి పర్యటన..