అండమాన్ దీవుల పేర్లు మార్పు

Update: 2018-12-31 04:53 GMT
జనానికి ఉపయోగపడే పనుల కన్నా వివాదాస్పదంగా ఉన్న విషయాలను కెలికి లబ్ధి పొందడానికే బీజేపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మొన్నటికి మొన్న యూపీలో ముస్లిం ఆధారిత పట్టణాలు, కాలనీల పేర్లు మార్చేసింది యోగి ఆధిత్యనాత్ ప్రభుత్వం.. ఇక దేశవ్యాప్తంగా కూడా మోడీ వివిధ రాష్ట్రాల్లో స్వాతంత్ర నేతలు వివిధ సామాజికవర్గాల కోణంలో పేర్లను మార్చేస్తున్నారు.

తాజాగా ప్రధాని మోడీ కన్ను అండమాన్ నికోబార్ దీవులపై పడింది. పర్యటనలంటే చెవికోసుకునే ప్రధాని తాజాగా దేశంలోని అండమాన్ నికోబార్ దీవులపై దృష్టిపెట్టారు. అక్కడ పర్యటించిన మోడీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ దీవుల్లోని మూడు దీవుల పేర్లను తాజాగా మార్చేశారు.

ద రోజ్ ఐలాండ్ దీవికి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరును పెట్టారు. ఇక దనెయిల్ ఐలాండ్ కు షాహీద్ ద్వీప్, హావ్ లాక్ ఐలాండ్ కు స్వరాజ్ ద్వీప్ గా పేర్లను ప్రకటించారు.

స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారి భారత్ పై దండెత్తి అండమాన్ నికోబార్ పై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ జెండా ఎగురవేసి 75 ఏళ్లు అయిన సందర్భంగా మోడీ ఒక్కడ పర్యటించి జాతీయజెండాను ఎగురవేసి నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం నేతాజీ పేరు మీద 75 రూపాయల నాణేన్ని - నేతాజీ స్మారక స్టాంపులను మోడీ విడుదల చేశారు. కాగా ఎన్నో ఏళ్ల నుంచి స్థానికుల సెంటిమెంట్ గా ఉన్న దీవుల పేర్లు మార్చవద్దని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా మోడీ దూకుడుగా ముందుకెళ్లడం విశేషం.



Full View

Tags:    

Similar News