ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరో అవార్డు వరించింది. ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపాజిల్’ అనేది రష్యాలో ఒక అత్యున్నత పురస్కారం. ఈసారి ఆ అవార్డును ప్రధాని మోదీకి ఇచ్చి ఆయనను సత్కరించనున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రష్యా రాయబార కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. భారత్ - రష్యా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో మోదీ భారతప్రధానిగా అసాధారణ సేవలు అందించారని ఆ దేశం కొనియాడుతూ ఈ అవార్డుతో సత్కరించనుంది. మోదీకి ప్రకటించిన అవార్డుపై శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం కూడా చేయడంతో అది అధికారం అయ్యింది. మోదీకి ఇచ్చిన అవార్డు ఆ దేశపు భారతరత్న వంటిది. రష్యాలో వివిధ రంగాల్లో రష్యా ప్రగతిని - పరపతిని ప్రమోట్ చేసిన వారికి ఇచ్చే అవార్డు ఇది. అపుడపుడు ఇలా ఇతర దేశపు నాయకులకు ఇస్తుంటారు. ఈ అవార్డును 1698లో జార్ చక్రవర్తి పీటర్ ది గ్రేట్ స్థాపించారు.
ఢిఫెన్స్ - ఆర్థిక భాగస్వామ్యాలపై గత ఐదేళ్లలో పుతిన్ - మోదీ పలుసార్లు సమావేశం అయ్యారు. పుల్వామా అటాక్ సమయంలో మోడీకి ఫోన్ చేసి సానుభూతి తెలిపినే ఏకైక పి-5 లీడర్ పుతిన్.
ఎన్నికల సమయంలో మోడీకి వచ్చిన రెండో అవార్డు ఇది. ఇటీవలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘జయేద్ మెడల్’తో మోడీని సత్కరించింది. మోడీ ప్రధాని అయ్యాక భారత్ - యుఏఈ సంబంధాలు మెరుగు పడ్డాయని మోడీపై ఆ దేశం ప్రశంసలు కురిపించింది. ఆయన సేవలను అవార్డుతో సత్కరించింది.
ఎన్నికల వేళ ఇప్పటికే తన వ్యూహాలతో తన గాలే వీస్తోందని నమ్మించగలుగుతున్న నరేంద్ర మోడీకి ఇదే సమయంలో ఇలాంటి ప్రశంసలు అవార్డులు రావడం పార్టీకి పెద్ద ప్రోత్సాహం.