జాగ్రత్తగా ఉండాల్సిందే.. మరోమార్గం లేదు : మోదీ
కరోనా వ్యాధి పట్ల ప్రజలంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. దేశంలో రోజురోజుకూ మహమ్మారి విస్తరిస్తున్నదని ప్రజలు తేలికగా తీసుకుంటే ప్రమాదంలో పడతారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. కనీసం రెండు భౌతికదూరం పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా ఉమ్మి వేయద్దని సూచించారు. బిహార్ లో రూ. 20,050 కోట్లతో ఏర్పాటుచేయనున్న ప్రధానమంత్రి మత్య్స సంపద యోజన పథకాన్ని గురువారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్స్యసంపద యోజన పథకం మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకంలో దేశంలో సంపద సృష్టి జరుగుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామన్నారు.
ఇదో విప్లవాత్మక పథకం
మత్స్యసంపద యోజన పథకం ఎంతో విప్లవాత్మకమైనదని ప్రధాని మోదీ చెప్పారు. మరో నాలుగేళ్లలో దేశంలో చేపల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది తమ లక్ష్యమన్నారు. పాలరైతుల కోసం ఈ గోపాల అనే మొబైల్ యాప్ను కూడా ప్రధాని ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పాడి రైతులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
వ్యాక్సిన్ వచ్చేవరకు జర భద్రం
కరోనాకు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎంతో కృషిచేస్తున్నారని ప్రధాని చెప్పారు. అప్పటివరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారిని, వయోవృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు.