తనను అడ్డు తొలిగించుకోవాలని కాంగ్రెస్ మాజీ నేత మణిశంకర్ అయ్యర్ ప్రయత్నించారని, పాకిస్థాన్‌లో ఆయన అందుకు సుపారీ కూడా ఇచ్చారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ఆరోపణలు చేశారు. బనాస్కాంఠా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. ప్రధానినుద్దేశించి కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ నీచమైన వ్యక్తి అంటూ గురువారం అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి మణిశంకర్ అయ్యర్ ను కాంగ్రెస్ తొలిగించింది. అయ్యర్ వ్యాఖ్యలపై విమర్శనాస్ర్తాలు సంధించిన మోడీ వరుసగా రెండోరోజు కూడా తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
`నేను ప్రధానమంత్రి అయ్యాక.. ఆయన (అయ్యర్) పాకిస్థాన్ వెళ్లి కొంతమందిని కలిశారు. మోడీ అడ్డు తొలిగించనంతవరకు భారత్, పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడవని ఆ సమావేశంలో అయ్యర్ అన్నారు. ఆ సమాచారం అంతా సోషల్‌మీడియాలో ఇప్పటికీ అందుబాటులో ఉంది. అడ్డు తొలిగించడమంటే అర్థమేమిటి? మీరు సుపారి ఇచ్చేందుకు పాకిస్థాన్ వెళ్లారా? ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా నన్ను ఎన్నుకున్నారు. అదే నేరమా?`` అని మోడీ ప్రశ్నించారు. పాకిస్థాన్‌లో అయ్యర్ భేటీ మూడేండ్ల కిందట జరిగినా, కాంగ్రెస్ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయిందని మోడీ నిలదీశారు. అట్కానా (అంశాన్ని అడ్డుకోవడం) - లట్కానా(అంశాన్ని వేలాడదీయడం), భట్కానా(అంశాన్ని పక్కదారి పట్టించడం) అనేదే కాంగ్రెస్ పనివిధానమని విమర్శించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నైతికంగా దెబ్బకొట్టే పలు అంశాలను ప్రధాని మోడీ ప్రస్తావించారు. ప్రధానమంత్రినే కాదు..మన జవాన్లను కూడా కాంగ్రెస్ నేతలు నమ్మరని వ్యాఖ్యానించారు. `మన ఆర్మీ సాహసాలను విని దేశప్రజలంతా గర్వించారు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే సంతోషంగా లేదు. నిజంగా మెరుపుదాడులు జరిగాయా? జరగలేదని పాకిస్థాన్ అంటోంది కదా? మన సైనికులు ఎందుకు గాయపడలేదు? ఇలాంటి ప్రశ్నలు అడిగింది. ఈ విషయంలో మీరు పాకిస్థాన్‌ను నమ్ముతారా? భారత్‌ను నమ్ముతారా?' అని మోడీ హాజరైన వారిలో కాంగ్రెస్‌పై సందేహాలు కలిగేలా చేశారు.
ఇదిలాఉండగా...ప్రధాని 'నీచుడు' అంటూ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, ఈ తతంగాన్ని ఓ నాటకంగా కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొ న్నారు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న నాటక మని, ప్రజలు దీన్ని ఓ కంట కనిపెట్టాలని ఆయన సూచించారు. మరోవైపు తాను చేసిన 'నీచ్ కిసమ్ కా ఆద్మీ' వ్యాఖ్యలపై అయ్యర్ స్పందించారు. దీనికి పార్టీ తనకు ఎంత పెద్ద శిక్ష వేసినా స్వీకరిస్తానన్నారు. తన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలిగితే తాను కూడా బాధపడతానన్నారు. మోడీని అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.