వారణాసి ఎయిర్ పోర్టులో ప్రధానికి షాక్

Update: 2020-02-29 14:08 GMT
ఈ మధ్య కాలంలో విమానాశ్రయాలలో సిబ్బంది...ప్రవర్తన చర్చనీయాంశమవుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు - రాజకీయ నాయకులు ప్రయాణించే సందర్భాల్లో వారితో కొంతమంది సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఘటనలపై వార్తలు వచ్చాయి. కొన్ని సార్లు....ప్రయాణికుల ప్రవర్తన వల్ల సిబ్బంది దురుసుగా తమ ఇలాకాలోకి వచ్చిన తర్వాత తమ మాటే చెల్లాలని ఫీలయ్యే సిబ్బంది వల్ల కొన్ని విమానయాన సంస్థలకూ చెడ్డపేరు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇటువంటి మరో ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌ సింగ్‌ కు వారణాసి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అధ్యక్షుడి బృందం లగేజీ పరిమితికి మించి ఉండటంతో అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందిగా కోరుతూ వారిని విమానాశ్రయ సిబ్బంది ఆపడం చర్చనీయాంశమైంది.

2 రోజుల పర్యటన కోసం మారిషస్ ప్రధాని పృథ్వీరాజ్‌ సింగ్‌ భారత్‌ కు వచ్చారు. ఢిల్లీ వెళ్లేందుకు వారణాసిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన పృథ్వీరాజ్‌ సింగ్‌ కు చేదు అనుభవం ఎదురైంది. పృథ్వీరాజ్‌ సింగ్‌ తో పాటు వచ్చిన ఆరుగురు సభ్యుల లగేజీ వెయిట్ ఎక్కువగా ఉండడంతో ఎయిరిండియా సిబ్బంది వీరిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చివరకు సిబ్బందికి ఉన్నతాధికారులు తగిన సూచనలు చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనపై సిబ్బందితో మాట్లాడామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ అక్షదీప్‌ మాథుర్‌ అన్నారు. భారత పర్యటనకు వచ్చిన ప్రముఖుల అదనపు లగేజీకి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఎయిరిండియా సిబ్బందికి విమానయానశాఖ సూచించినట్లు తెలుస్తోంది. ఇకపై ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలని సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News