కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ప్రభుత్వ ఆసుపత్రులలో అందరికీ చికిత్స అందించడం సాధ్యపడడం లేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు ఏపీ, తెలంగాణలో కరోనా చికిత్సకు అనుమతులిచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని ప్రైవేటు ఆసుపత్రులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే, కరోనా బాధితుల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు అందినకాడికి దండుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఆసుపత్రులైతే రోజుకు దాదాపు లక్ష రూపాయలు ఫీజు ముక్కుపిండి వసూలు చేశాయని విమర్శలు వచ్చాయి. ఈ కోవలోనే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని మురళీ కృష్ణ ఆసుపత్రి కూడా కరోనా బాధితుల నుంచి లక్షల్లో ఫీజులు దండుకుంటోందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ దోపిడీపై ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యాలయానికి ఏలూరుకి చెందిన బాధితుడు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం సీరియస్ గా స్పందించింది.
ఆ ఫిర్యాదును పరిశీలించాలని రాష్ట్ర అధికారి జనార్థన్‌ను ఆదేశించింది మురళీ కృష్ణ మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిలో కరోనా రోగుల నుంచి రూ.4 లక్షలు మొదలు రూ.14 లక్షల దాకా వసూలు చేస్తున్నారని వంశీ ఫిర్యాదు చేశారు. డబ్బులు దండుకున్నా కూడా సరైన వైద్యం అందించకపోవడంతో 13 మంది కరోనా రోగులు చనిపోయారని తెలిపారు. వంశీ ఫిర్యాదు ప్రకారం ఫీఎంవో ఆదేశాలతో ఆ ఆస్పత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండానే కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారని గుర్తించారు. ఆ ఆరోపణలు నిజమని తేలడంతో ఆస్పత్రిని సీజ్ చేశారు. ఇక్కడి కరోనా పేషెంట్లను వేరే ఆస్పత్రికి తరలించారు. రోజుకు రూ.లక్ష చొప్పున కరోనా రోగుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.