కరోనా వేళ.. పట్టుకునేందుకు సరైన పాయింట్ లేక కిందా మీదా పడిపోతున్న ఏపీ విపక్షనేత చంద్రబాబుకు.. బందరు లడ్డూ లాంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం ఇచ్చిందా? కరోనా కట్టడి విషయంలో ఇప్పటికే సరైన చర్యలు తీసుకోలేదని.. ఈ కారణంగానే పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరణాలు సైతం ఈసారి ఎక్కువగా ఉండటాన్ని చూపిస్తున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో జగన్ సర్కారు ముందుచూపుతో వ్యవహరించలేదన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇలాంటివేళ.. వ్యాక్సినేషన్ కు అవసరమైన టీకాలు చంద్రబాబు ఇప్పిస్తారా? అంటూ అధికారపక్ష నేతలు ప్రశ్నించటం మొదలైంది. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు సంబంధించి ఒక కీలకమైన పాయింట్ ను పట్టుకున్నారు విపక్ష నేత చంద్రబాబు. కరోనా నియంత్రణలో ప్రభుత్వంఘోరంగా విఫలమైందని మండి పడుతున్న చంద్రబాబు.. టీకాల కోసోం బడ్జెట్ లో రూ.500 కోట్లు మాత్రమే పెడతారా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు.
ఈ మొత్తం అసలు ఏ మూలకు సరిపోతోంది? మిగిలిన రాష్ట్రాలు ముందే ఆర్డర్లు పెట్టి.. డెలివరీ కూడా తీసుకుంటుంటే.. జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. ఎవరైనా మాట్లాడితే దాడులు చేస్తున్నారని.. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారంటూ బాబు మండిపడుతున్నారు. ఇలాంటి మాటలు మామూలే అయినప్పటికీ.. బడ్జెట్ లో టీకాల కోసం రూ.500కోట్లు మాత్రమే కేటాయించారన్న చంద్రబాబు మాట ఇప్పుడు సంచలనంగా మారింది.
ఓపక్క టీకా కోసం రూ.1500 కోట్లు ఖర్చుకు తాము సిద్ధమని.. అవసరమైతే మరింత ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వ్యాక్సినేషన్ కు రూ.500 కోట్ల కేటాయింపులే చేస్తే.. బాబు సరైన పాయింట్ పట్టుకున్నట్లే అవుతుంది. బాబు చెప్పినట్లుగా బడ్జెట్ లో వ్యాక్సినేషన్ కు రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారా? అన్న దానిపై ఏపీ సర్కారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. అనవసరమైన అపోహలు పెరిగే అవకాశం ఉందన్నది మర్చిపోకూడదు.