పీవోకే ప్ర‌జ‌ల్ని పాక్ ఎలా చూస్తుందో చెప్పిన అక్క‌డి ప్ర‌ధాని

Update: 2017-11-16 08:15 GMT
పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌.. ద‌శాబ్దాలుగా వివాదాల్లో న‌లుగుతున్న ప్రాంతం. భార‌త్‌కు చెందిన ఈ ప్రాంతం పాక్ నియంత్ర‌ణ‌లో ఉండ‌టం.. అప్ప‌ట్లో ప్ర‌ధాని నెహ్రు చేసిన పొర‌పాటుతో ఆ ప్రాంతం ఇప్ప‌టికి పాక్ ఏలుబ‌డిలో ఉంది. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీవోకే)  పాక్‌కు చెందిన‌దంటూ జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బారాముల్లాలో ఆయ‌న చేసిన మ‌రిన్ని వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి. ఇదిలా ఉంటే.. పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ ప్ర‌ధాని ర‌జా ఫ‌రూక్‌.. పాక్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కశ్మీరీల‌పై పాక్ ప్ర‌భుత్వం చూపిస్తున్న వివ‌క్ష‌పై ఫైర్ అయిన ఆయ‌న నీలం-జీలం 55కేఎం జ‌ల‌సొరంగం ప్రాంతంలో నివ‌సించే ప్ర‌జ‌ల‌కు మంగ్లా డ్యాం నుంచి చుక్క నీరు కూడా రావ‌టం లేద‌ని ఆయ‌న మండిప‌డుతున్నారు.
పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ ప్ర‌జ‌లు మంగ్లా డ్యాం జ‌లాల్ని వాడుకునే హ‌క్కు లేదా? అని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. తాను పేరుకే ప్ర‌ధాన‌మంత్రిని కానీ త‌న మాట అస్స‌లు చెల్లుబ‌డి కావ‌టం లేద‌న్నారు. త‌న హోదాను స‌రిగా నిర్వ‌చించాల‌న్న ఆయ‌న‌.. క‌నీస అధికారాల్ని కూడా త‌న‌కు లేకుండా చేశార‌న్నారు. ఒక‌వేళ త‌న హోదాను చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో ఉంటే త‌న‌ను ప‌రిశీల‌కుడిగా ఉంచాల‌న్నారు.

మంగ్లా డ్యాం కార‌ణంగా ఇళ్ల‌కు.. పొలాల‌కు నీళ్లు క‌ర‌వు అయ్యాయ‌ని.. మంచినీటికి కూడా క‌ట‌క‌ట‌లాడాల్సి వ‌స్తోంద‌ని వాపోయారు. పాక్ స‌ర్కారు నిర్ల‌క్ష్యం వీడ‌కుంటే చూస్తూ ఊరుకోమ‌న్న ఆయ‌న‌.. పాక్ అక్ర‌మిత క‌శ్మీరీల‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేస్తే ఇబ్బందేఅన్నారు.

పాక్ అక్ర‌మిత ప్ర‌జ‌లు.. సిక్కులు.. మొఘ‌లలు.. పాథ‌న్ల‌తో పోరాడిన చ‌రిత్ర వారికి ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు. ఓప‌క్క మ‌న ద‌గ్గ‌రున్న ఫ‌రూక్ అక్ర‌మిత కాశ్మీర్ పాక్ దేన‌న్న మాట‌లు చెబుతున్న వేళ‌.. పీవోకే ప్ర‌ధాని మాత్రం పాక్ త‌మ ప‌ట్ల వివ‌క్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తుద‌న్న మాట చెబుతుండ‌ట గ‌మ‌నార్హం.
Tags:    

Similar News