ఈ తెలుగు త‌మ్ముడి నిర్వాకం చూశారా?

Update: 2017-07-05 05:10 GMT
తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీ న‌డి వీధుల్లో త‌లెత్తుకుని తిరిగేలా చేసేందుకే స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అనుకున్న‌ట్లుగానే ఆయ‌న తెలుగు నేల రాజ‌కీయాల‌తో పాటు జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ చ‌క్రం తిప్పారు. తెలుగోడి స‌త్తా ఏమిటో జాతీయ పార్టీల నేత‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి... ఇప్పుడు నారా చంద్ర‌బాబునాయుడు ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న టీడీపీకి చాలా వ్య‌త్యాస‌మే ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది. నిత్యం రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం, పార్టీ కార్య‌క‌ర్త‌ల అభ్యున్న‌తి, వారి స‌త్ప్ర‌వ‌ర్త‌న‌పై గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడే చంద్ర‌బాబుకు ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చిన ఓ వార్త షాకింగేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆ వార్త వివ‌రాల్లోకి వెళితే... శ్రీ‌కాకుళం జిల్లాలోని ప‌లాస మునిసిప‌ల్ చైర్మ‌న్ నేత పూర్ణ‌చంద్రరావు  త‌ర‌చుగా ఎమ్మెల్యే, సొంత పార్టీ కీల‌క నేత గౌతు శ్యామ‌సుంద‌ర శివాజీ వివాదాల‌కు కాలు దువ్వుతుంటారు. పూర్ణ‌చంద‌ర్ గ‌తంలో ప‌లాస‌ మునిసిపాలిటీ క‌మిష‌న‌ర్ ను కొట్టార‌ట‌. ఆ వార్త‌లు సంచ‌ల‌నం అయ్యాయి. తాజాగా పూర్ణచంద్ర‌రావు మరో ఘ‌న‌కార్యం వెలుగులోకి వ‌చ్చింది.

పేకాట అంటే అమితాస‌క్తి చూపే పూర్ణ‌చంద్ర‌రావు... తాను ఓ మునిసిపాలిటీకి చైర్మ‌న్‌ గా ఉన్నాన‌న్న విష‌యాన్ని కూడా మ‌రిచిపోయారు. కొంద‌రు పేకాట‌రాయుళ్ల‌ను వెంటేసుకుని శ్రీ‌కాకుళం జిల్లా బారువాలో దుకాణం తెరిచేశారు. మునిసిప‌ల్ చైర్మ‌న్ పేకాట ఆడుతున్నార‌న్న విష‌యంపై విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్క‌డ‌కు చేరుకున్నార‌ట‌. పోలీసుల‌ను క‌నిపించినా కూడా పూర్ణ‌చంద్ర‌రావు ఏమాత్రం బెద‌ర‌లేద‌ట‌. చేతిలో  పేక ముక్క‌ల‌తో రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డ పూర్ణ‌చంద్ర‌రావు సహా ఆయ‌న‌తో పేకాట ఆడుతున్న మ‌రో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించార‌ట‌. ఈ సంద‌ర్భంగా పూర్ణ‌చంద్ర‌రావు పేకాట ఆడుతున్న ప్రాంతం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున న‌గ‌దు, సెల్‌ఫోన్లు, ద్విచ‌క్ర వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ త‌ర్వాత పూర్ణచంద్ర‌రావు స‌హా మిగిలిన పేకాట‌రాయుళ్లంద‌రిపైనా పోలీసులు కేసులు న‌మోదు చేశార‌ట‌. ఈ విష‌యంపై .. పార్టీ అధినేత‌గా చంద్ర‌బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదంటే... ఆయ‌న‌కు తెలియ‌దా? తెలిసినా ఊరికే ఉన్నారా?
Tags:    

Similar News