మొన్న సీఎం కేసీఆర్ కు.. నేడు సీఎస్ షాకిచ్చిన పోలీసులు

Update: 2021-09-30 05:34 GMT
తెలంగాణ పోలీసులు సామాన్య ప్రజలను ఎలా ట్రీట్ చేస్తున్నారో.. రోడ్ల మీదకు వచ్చే ప్రభుత్వ ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను కూడా అలానే చూస్తున్నారన్న విషయం తాజాగా బయటపడింది. స్పీడ్ లిమిట్ విషయంలో ఎవరైనా తగ్గేదేలే అని అంటున్నారు. నిర్ధేశించిన దానికంటే ఎక్కువ స్పీడ్ వెళ్తే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారు.

నిబంధనల గురించి మాట్లాడే ఉన్నతాధికారి వాహనం విషయంలోనూ పోలీసులు వెనక్కి తగ్గకుండా ఫైన్ విధించడం విశేషం. తాజాగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. ఓవర్ స్పీడ్ తో వెళ్లిన సీఎస్ వాహనానికి పోలీసులు జరిమానా విధించారు. టోలిచౌకి పీఎస్ పరిధిలోని పీవీ నరసింహరావు ఫ్లై ఓవర్ పై సీఎస్ సోమేశ్ కుమార్ వాహనం టీఎస్ 09 ఎఫ్ఏ 0001 ఓవర్ స్పీడుతో వెళ్లింది.. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనానికి మూడు వేల రూపాయల చాలాన్ విధించారు.

ఈ మధ్య సీఎం కేసీఆర్ కాన్వాయ్ పై కూడా తెలంగాణ పోలీసులు ఫైన్ విధించి సంచలనం సృష్టించారు. ట్రాఫిక్ రూల్స్ కు సీఎం కాన్వాయ్ కూడా అతీతం కాదని నిరూపించి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యమంత్రి వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని నిరూపించారు. సీఎం కాన్వాయ్ పై ఓవర్ స్పీడ్ కు సంబంధించి మొత్తం నాలుగు ఫైన్లు విధించారు.

ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉన్నతాధికారి సీఎస్ కు సైతం ఏకంగా 3వేల ఫైన్ విధించారు. ఇలా ప్రభుత్వాధినేతలైనా.. సామాన్యులైనా సరే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
Tags:    

Similar News