కుక్క చ‌స్తే.. ఐదుగురు స‌స్పెండ్‌!

Update: 2016-02-24 07:54 GMT
అవును.. ఒక కుక్క చావు ఐదుగురు పోలీసుల ఉద్యోగాల‌కు ఎస‌రు పెట్టింది. ఒక కుక్క చ‌స్తే రియాక్ష‌న్ ఇంత తీవ్రంగా ఉంటుందా? అన్న ఆశ్చ‌ర్యం అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఈ కుక్క అలాంటి ఇలాంటిది కాదు. పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేయ‌ట‌మే కాదు.. పోలీస్ కుక్క‌ల్లో ఎస్ ఐ ర్యాంకు సాధించిన జాతికుక్క‌. అలాంటి కుక్క‌.. అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్రాణం పోతే డిపార్ట్ మెంట్ చూస్తూ ఊరుకోదు క‌దా.బీహార్‌ లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌.. కాస్త చిత్రంగా అనిపించినా కుక్క స‌త్తా తెలిస్తే మాత్రం.. ఆ మాత్రం యాక్ష‌న్ అవ‌స‌ర‌మ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

బీహార్‌ లోని రోటాస్ జిల్లాకు చెందిన గులాబ్ అనే పోలీస్ కుక్క మ‌హా చురుకైంది. బీహార్ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ శిక్ష‌ణ పొందిన కుక్క‌గా గులాబ్‌కి పేరుంది. అలాంటి కీల‌క‌మైన గులాబ్‌ ను రోడ్డు మీద తీసుకెళుతుండ‌గా ఒక ట్ర‌క్ ఢీ కొట్ట‌టంతో అది అక్క‌డిక‌క్కడే చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై సీరియ‌స్ అయిన అధికారులు అసలేం జ‌రిగింద‌న్న విష‌యాన్ని ఎంక్వ‌యిరీ చేశారు. అధికారుల నిర్ల‌క్ష్య‌మే గులాబ్ మ‌ర‌ణానికి కార‌ణంగా తేల్చిన పోలీసు ఉన్న‌తాధికారులు.. దాని చావుకు కార‌ణ‌మైన ఒక ఎస్ ఐతో పాటు న‌లుగురు సిబ్బందిపై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ఇప్పుడు చెప్పండి.. గులాబ్ చావును సీరియ‌స్ గా తీసుకోవాలా? అక్క‌ర్లేదా?
Tags:    

Similar News