వైసీపీ కీలకనేత పై కేసు నమోదు..ఎందుకంటే!

Update: 2020-04-14 10:50 GMT
ఆంధ్రప్రదేశ్ లో  లాక్ డౌన్ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించటం - మాస్కులు ధరించటం చాలా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇక ఎవరైనా సరే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. ఈతరుణంలోనే లాక్ డౌన్ నియమాలని పాటించలేదంటూ నందికొట్కూరు వైసీపీ ఇన్‌ చార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పై - మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి పై పోలీసులు కేసు నమోదు చేసారు.

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు ఘోరంగా పెరుగుతున్న నేపధ్యంలో అధికారులు  నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసారు. అయితే - బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పై - మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి  నియోజకవర్గంలో హైపో ద్రావణం స్ప్రే చేయించారు. ఆ  ఈ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. అయితే స్ప్రే చేయిస్తున్న సమయంలో సోషల్‌ డిస్టెన్స్‌ పాటించలేదు. దీనితో  ఇక ప్రజా సంక్షేమం కోసం పని చెయ్యాల్సిన నాయకులై ఉండి సామాజిక దూరం పాటించకపోవడంతో వారిపై కేసు నమోదైంది.

ఈ కేసు వ్యవహారంపై బైరెడ్డీ సిద్ధార్థ రెడ్డి  - లబ్బి కానీ ఇంతవరకూ స్పందించలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున శానిటైజేషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఇక సామాజిక దూరంపాటించకుంటే తమకు ఎవరైనా ఒకటే అని పోలీసులు చెప్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు అందరూ విధిగా పాటించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News