కరోనా వైరస్ వేగంగా విస్తరిసున్న నేపథ్యంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే, ఈ లాక్ డౌన్ ను బ్రేక్ చేస్తోన్న వారిపై తెలంగాణ ప్రభుత్వం భారీ జరిమానాలకు దిగుతోంది. ఇంట్లో నుంచి బయటికి రావొద్దంటూ అధికార, పోలీసు యంత్రాంగం ప్రాధేయపడుతున్నా - లాఠీ ఛార్జీలకు దిగినా కూడా పెద్దగా ఫలితం కనిపించకపోవటంతో ఇక జరిమానాలను విధించేలా చర్యలు తీసుకుంది. భారీగా ఫైన్ విధిస్తోంది.
లాక్ డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకుని నడిరోడ్డు మీద విధులను నిర్వర్తించే కానిస్టేబుళ్ల వరకు దండం పెట్టి మరీ విజ్ఙప్తి చేశారు. కానీ , ఏదో ఒక కారణంతో రోడ్ల మీద చాలామంది బలాదూర్ గా తిరుగుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీద తిరిగే వారి సంఖ్య గ్రామస్థాయిలో మరింత ఎక్కువగా ఉంటోంది. దీన్ని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జరిమానాలను విధించే ప్రక్రియను చేపట్టింది. ఒకేరోజు మూడుసార్లు లేదా అంతకు మించి ఎక్కువసార్లు కనిపిస్తే.. 500 రూపాయల వరకు జరిమానా విధిస్తోంది.
ఇందులో భాగంగా ...ఒకే రోజు బయట అయిదుసార్లు కనిపిస్తే వెయ్యి రూపాయలను జరిమానా విధించనుంది. ఈ ప్రక్రియను స్థానిక సంస్థలకు అప్పగించింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండల్ ఇటిక్యాలలో తొలిసారిగా మిట్టమెల్లి రాజారెడ్డి అనే వ్యక్తికి ఫైన్ వేశారు. ఒకేరోజు మూడుసార్లు రోడ్ల మీద తిరుగుతూ కనిపించడంలో అతనిపై జరిమానా విధించారు. అతని వద్ద నుంచి 500 రూపాయలను వసూలు చేశారు. లాక్ డౌన్ కొనసాగుతున్న ప్రస్తు పరిస్థితుల్లో ఒకేరోజు మూడుసార్లు బయట తిరుగుతూ కనిపించడం వల్ల 500 రూపాయల జరిమానా విధించినట్లు ఇటిక్యాల గ్రామ కార్యదర్శి వెల్లడించారు. జరిమానాకు సంబంధించిన రశీదును కూడా అతని చేతిలో పెట్టారు.