సొంత కూతురినే చెల్లిగా పరిచయం చేసి... ముగ్గురు భర్తలను అవలీలగా మార్చేసిన ఇంద్రాణి... వ్యాపార సామ్రాజ్యంలోనూ అంతే తేలికగా అక్రమాలకు తెరలేపింది. ఆమె బిజినెస్ లోని అక్రమాలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. భర్తల్ని మార్చినట్లే కంపెనీల పేర్లను కూడా మార్చేసి... వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించింది, మీడియా టైకూన్ ఇంద్రానీ ముఖర్జీయా. ఆమె క్రిమినల్ మైండ్ చూసి.. తలపండిన బిజినెస్ మెన్ లే ఆశ్చర్యపోతున్నారు.
ఆది నుంచి ఇంద్రాణి వ్యాపారాలు వివాదాస్పదమే. షీనాతో ఆమె అనుబంధం ఎంత గందరగోళమో....ఆమెకు చెందిన సంస్థల గుర్తింపు, కార్యకలాపాలు కూడా అంతా గందరగోళమే.ఇంద్రాణి తన సంస్థల పేర్లు మార్చిన తీరు, ఒక సంస్థకు మరో సంస్థకు ఉన్న సంబంధాలు...తలపండిన వ్యాపారవేత్తలకు కూడా అర్థం కావు. ఇంద్రాణి కంపెనీలపై ఆరోపణలు రావడంతో రెండేళ్ల కిందట సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఆఫీస్(SFIO) అనే సంస్థ. ఆమె కంపెనీల క్రాస్ హోల్డింగ్స్ చిక్కుముడి విప్పే ప్రయత్నం చేసింది. ఓ ఎన్జీవో ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి... ఓ నివేదిక తయారు చేసింది. ఇందులో విస్తుగొలిపే నిజాలున్నాయి.
ఇంద్రాణి, ఆమె భర్త పీటర్ ముఖర్జీయాకు చెందిన దాదాపు ఐదు కంపెనీల పేర్లు మారినట్లు SFIO తన నివేదికలో వెల్లడించింది. INX రిక్రూట్ మెంట్ సర్వీసెస్ పేరుతో ప్రారంభించిన సంస్థ పేరును INX సర్వీసెస్ గా మార్చగా.. ప్రస్తుతమున్న గంగా ఎగ్జిక్యూటివ్ సెర్చ్ కంపెనీ పేరు గతంలో INX ఎగ్జిక్యూటివ్ సెర్చ్ గా ఉండేది. ఇక IM మీడియాను సరస్వతీ మీడియాగా మార్చారు. ప్రస్తుతమున్న ఇన్ కాన్ సంస్థ పేరు... గతంలో ఇంద్రాణి ముఖర్జీయా న్యూస్ గా ఉండేది. ఇక ప్రధాన కంపెనీ INX మీడియా పేరును 9X మీడియాగా మార్చారు. 9X, 9X మ్యూజిక్ ఛానెళ్లు ఈ కంపెనీకి చెందినవే. 2010లో ప్రముఖ న్యూస్ X ఛానెల్ పేరును IMN న్యూస్ గా మార్చుతున్నట్లు ప్రకటించింది... ఇంద్రాణి. అయితే 2012 జులైలో న్యూస్ Xను ఇండియా న్యూస్ కొనుగోలు చేయడంతో... ఆమె ఆ ప్రతిపాదన విరమించుకుంది.
ఇంద్రాణి గ్రూపు కంపెనీల మధ్య పెట్టుబడులు, వాటాల కొనుగోలు వ్యవహారాల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు SFIO తన నివేదికలో పేర్కొంది. ఓ బడా కార్పొరేట్ సంస్థ దగ్గరుండి మరీ వాటాల కొనుగోలు, అమ్మకాల లావాదేవీల తతంగాన్ని నడిపించిందని రిపోర్ట్ లో ఆరోపించింది. ఈ రిపోర్ట్ ను SFIO సుప్రీంకోర్టుకు కూడా సమర్పించింది. మొత్తమ్మీద సంస్థల ముసుగులో ఇంద్రాణి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. గుర్తింపులేని ఎన్నో కంపెనీలను సృష్టించి, అవలీలగా పేరు మార్చి- అక్రమ వ్యాపారం ఎలా చేయాలో నిరూపించారు!