ఎన్నారై - పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితుల మూడురోజుల కస్టడీ శుక్రవారంతో ముగిసింది. నందిగామలో కారుతోపాటు జయరాంను వదిలిపెట్టిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సమయం సరిపోనందున మరో వారంరోజులపాటు కస్టడీకి ఇవ్వాలని శనివారం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే, మూడ్రోజుల దర్యాప్తులోనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.150 కోట్ల స్కెచ్ తో ఈ హత్య జరిగిందని సమాచారం.
ప్రధాన నిందితుడు అయిన రాకేష్ రెడ్డి సంచలన అంశాలు పోలీసులకు వెలువరించినట్లు సమాచారం. జయరాం నుంచి బలవంతంగా రాయించుకొన్న పత్రాలతో ఆయన ఆస్తులను వివాదంలోకి లాగి.. వారి కుటుంబంతో రాజీ కుదుర్చుకొని కనీసం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు సంపాదించాలనే భారీ కుట్రను రాకేశ్ రెడ్డి పన్నినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తనను చంపకుండా ఉంటే రూ.10 కోట్లు ఇస్తానని జయరాం బతిమిలాడినా వినిపించుకోకుండా హతమార్చినట్టు విచారణలో తేలినట్టు సమాచారం. ఈ భారీ స్కెచ్ వెనుకాల రాకేశ్ ఒక్కడే ఉన్నాడా? మృతుడి బంధువుల పాత్ర ఉన్నదా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. జయరాంకు సంబంధించిన ఆస్తుల వివరాలను శిఖాచౌదరితో సన్నిహితంగా ఉన్న సమయంలో సేకరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. తన ప్లాన్ ను పక్కాగా అమలుచేసేందుకు కొందరు పోలీసులు - రౌడీషీటర్లు - రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంప్రదించినట్టు పోలీసులు గుర్తించారు. ప్రణాళిక సజావుగా సాగి ఆస్తి చేతికి చిక్కగానే ఒక్కొక్కరికి కోటి నుంచి రూ.ఐదు కోట్ల వరకు ముట్టజెప్పేలా ముందస్తుగా ఒప్పందాలు కూడా చేసుకొన్నట్టు తెలిసింది. హత్యకు సహకరించినందున జీవితంలో స్థిరపడేలా చేస్తానంటూ విశాల్ - నగేశ్ - శ్రీనివాస్ ను నమ్మించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
రాకేశ్ రెడ్డి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పోలీసులు.. అతడి ఇంటి నుంచి కొన్ని పత్రాలను - అతడు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకొన్నారు. గతంలో అతడిపై నమోదైన కేసుల చిట్టాను కూడా సేకరించారు. మరోవైపు జయరాం మేనకోడలు శిఖాచౌదరిపై అనుమానం వ్యక్తంచేస్తూ జయరాం భార్య పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. జయరాం ఇంటి నుంచి తన ప్రాజెక్టు డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకెళ్లానని గురువారం పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. జయరాం ఇంటి నుంచి కంపెనీ షేర్ల పత్రాలను తీసుకెళ్లారని వచ్చిన ఫిర్యాదుపై శిఖాచౌదరిని ప్రశ్నించినట్టు సమాచారం. కాగా, రాకేశ్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న పోలీసు అధికారుల గురించి పలు ఆధారాలు సేకరించారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ వద్దకు మృతదేహంతో వెళ్లానని రాకేశ్ రెడ్డి చెప్పడంతో.. అక్కడి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసులో నల్లకుంట ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ ను నిందితుడిగా చేర్చే అంశంపై అధికారులు చర్చిస్తున్నట్టు సమాచారం. దర్యాప్తు కీలక దశలో ఉన్నందని - విచారణ పూర్తయిన తర్వాతే వివరాలు మీడియాకు చెప్తానని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.