వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతల అక్రమాల గుట్లు అన్ని బయటపడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా ఉంటూ గుంటూరు జిల్లాలో సమాంతర ప్రభుత్వం నడిపి దోచుకున్నారన్న ఆరోపణలు కోడెల శివప్రసాద్ పై వెల్లువెత్తాయి. ఆయనపై కేసులు కూడా పెద్ద ఎత్తున నమోదయ్యాయి. కోడెల ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు మరో టీడీపీ నేతకు ఎసరు వచ్చింది. ఆయనే టీడీపీ నేత - మాజీ విప్ కూన రవికుమార్..
తాజాగా కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించారని ఆయనపై ఏపీ ఎన్జీవో నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
తాజాగా సరుబుజ్జిలి ఎంపీడీవో ఆఫీసుకెళ్లిన కూన అధికారులను బెదిరించాడు. టీడీపీ నేతలు తెచ్చిన దరఖాస్తులు తీసుకోరా అంటూ అధికారులను గదిలో వేసి చావకొడుతానంటూ హెచ్చరించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ విషయంలో ఒక్కటై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవికుమార్ ను అరెస్ట్ చేయకపోతే మూకుమ్మడి సెలవులు పెడుతామని హెచ్చరించారు..
స్పందించిన ప్రభుత్వం వెంటనే రవికుమార్ పై కేసు నమోదు చేసింది. అరెస్ట్ కోసం ఆముదాల వలసలోని ఆయన ఇంటికి వెళ్లగా పారిపోయారని తెలిసింది. అజ్జాతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు కోడెల తర్వాత అరెస్ట్ కు సిద్ధమైన మరో టీడీపీ నేత కూన రవికుమార్ కావడం విశేషం.