ప్రముఖ సినీ నిర్మాత, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ భూమి విషయంలో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు నెంబర్ 14లో ప్రేమ్ పర్వత్ విల్లాస్ పేరుతో పీవీపీ నిర్మాణాలు చేపట్టారు. ఇందులో విక్రమ్ కైలాస్ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం ఒక విల్లాను కొనుగోలు చేశాడు. మరిన్ని ఆధునికీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు విక్రమ్.
ఈ విషయం తెలిసిన పీవీపి అక్కడకు తన వైరితో వెళ్లి అడ్డుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తాను విల్లా అమ్మినప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలని చెప్పారట. ఈ క్రమంలో విక్రమ్ ఇంట్లోకి ప్రవేశించి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. విక్రమ్ పోలీసులకు ఫోన్ చేశారు. ఆ తర్వాత లిఖితపూర్వకంగా కంప్లియింట్ ఇచ్చారు. తనను చంపేస్తానని బెదిరించారని, ఆయన వల్ల తనకు ప్రాణహానీ ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు... పీవీపీని, నలుగురు అనుచరులను అరెస్ట్ చేశారు. మొత్తం తొమ్మిది మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. పీవీపీపై ఐపీసీ 447, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టుకు ముందు పోలీసులు పీవీపీకి నోటీసులు ఇచ్చారు. స్టేషన్‌లో ప్రశ్నించారు.