మోడీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని.. రాజీవ్ గాంధీ తరహాలో చంపాలని చూస్తున్నారని అప్పట్లో ఫుణే పోలీసులు ఓ సంచలన విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఢిల్లీకి చెందిన మానవ హక్కుల నేత రోనాల్డ్ విల్సన్ ను అరెస్ట్ చేశాడు. అతడి ఇంట్లో సోదా చేయగా.. ఓ లేఖ లభించింది. అందులో తెలంగాణకు చెందిన విరసం నేత వరవరరావు మోదీ హత్యకు అవసరమైన డబ్బు ఆయుధాలను సమకూరుస్తారంటూ రాసి ఉంది. ఈ అంశం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే..
అయితే దీనిపై వరవరరావు మీడియా ముందకు వచ్చి తాను మోడీ హత్యకు కుట్ర పన్నుతున్నట్టు లభించిన లేఖ బూటకమని.. ఆ లేఖకు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
తాజాగా వరవరరావుకు మహారాష్ట్ర - చత్తీస్ ఘడ్ పోలీసులు షాకిచ్చారు. మోడీ హత్యకు కుట్ర పన్నారన్న కేసులో విరసం నేత వరవరరావుతోపాటు జర్నలిస్టు క్రాంతి టేకుల సహా వరవరరావు కుమార్తె, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టులు కూర్మనాథ్ - సహా మరో ఇద్దరు విరసం నేతల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. వీరి ఫోన్లను స్విచ్ చాఫ్ చేసి మరీ లోపలి నుంచి తాళాలు వేసి ఈ దాడులకు దిగారు. ఈ దాడులకు తెలంగాణ పోలీసులు సహకారమందించారు. దీనిపై ప్రజాస్వామ్య వాదులు, విరసం నేతలు మండిపడుతున్నారు. నిర్బంధ తనీఖీలను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.