పోలీసుల ఎదుట హాజరైన రాయపాటి కోడలు

Update: 2020-08-14 09:10 GMT
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. కాసుల కక్కుర్తిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి చేసిన నిర్లక్ష్యానికి ఇప్పటికే 12మంది సజీవదహనం అయ్యారు. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఈ అగ్ని ప్రమాద ఘటన విచారణలో కీలక పరిణామం ఈరోజు చోటుచేసుకుంది. ఈ ప్రమాదఘటనపై విచారణకు ముమ్మరం చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రమేశ్ ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేసింది.

తాజాగా ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతను పోలీసులు విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటికే డా.మమతకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కరోనా బారినపడి మమత విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా సరే విచారణకు హాజరు కావాలని ఆదేశాలిచ్చారు. దీంతో మమత విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి మమత సీఈవోగా ఉన్నారు. స్వర్ణ ప్యాలెస్ లో ఆసుపత్రిని నిర్వహించింది మమత సారథ్యంలోని రమేశ్ ఆస్పత్రినే. అందుకే ఆమెను పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

    

Tags:    

Similar News