ర‌విప్ర‌కాశ్ అరెస్ట్ ఈ రోజేన‌ట‌!

Update: 2019-06-07 04:19 GMT
మోసం.. ఫోర్జ‌రీతో పాటు డేటా చౌర్యం లాంటి ప‌లు నేరారోప‌ణ‌ల నేప‌థ్యంలో గ‌డిచిన మూడు రోజులుగా సైబ‌రాబాద్ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రవుతున్న టీవీ 9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ అరెస్ట్ ఈ రోజు ఖాయంగా జ‌ర‌గ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు తొలుత నోటీసులు ఇచ్చిన త‌ర్వాతే ఆయ‌న్ను అరెస్ట్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో పోలీసులు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

అరెస్ట్ కు సంబంధించిన ప్రోసీజ‌ర్ లో తాము ఎక్క‌డా పొర‌పాటు చేయ‌కుండా ఉండేందుకు వీలుగా పోలీసులు ముంద‌స్తుగా న్యాయ నిపుణుల స‌ల‌హాల‌ను కూడా తీసుకోవ‌టం గ‌మ‌నార్హం. సైబ‌రాబాద్ లో విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న ర‌విప్ర‌కాశ్ కు తాజాగా బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఆయ‌న పోలీసుల ఎదుట హాజ‌రు కానున్నారు. టీవీ9 లోగోను రూల్స్ కు విరుద్దంగా విక్ర‌యించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ర‌విప్ర‌కాశ్ పై న‌మోదైన కేసు విచార‌ణ కోసం ఆయ‌న బంజారాహిల్స్ పోలీసుల వ‌ద్ద‌కు వెళ్ల‌నున్నారు.

గ‌డిచిన‌మూడు రోజుల పోలీసుల విచార‌ణ‌లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ముక్త‌స‌రిగా స‌మాధానాలు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. టీవీ9 సృష్టిక‌ర్త‌ను తానేన‌ని ప‌లుమార్లు చెప్పుకున్న ర‌విప్ర‌కాశ్‌.. తాను త‌ప్పు చేయ‌లేద‌న్న రీతిలో ఆయ‌న స‌మాధానాలు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. తాను ఇరుకున ప‌డే అంశాల విష‌యంలో మాత్రం ర‌విప్ర‌కాశ్ స‌మాధానాలు ఇవ్వ‌టం లేద‌ని చెబుతున్నారు. ర‌విప్ర‌కాశ్ త‌ప్పులు చేసిన‌ట్లుగా చూపించే అంశాల విష‌యంలో మౌనంగా ఉండ‌టం.. గుర్తు లేదంటూ చెప్పేస్తూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న మాట వినిపిస్తోంది.

ఆయ‌న్ను మూడు రోజులుగా విచార‌ణ చేస్తున్న‌ప్ప‌టికి ఎలాంటి ఫ‌లితం రాని నేప‌థ్యంలో.. అరెస్ట్ చేసిన జ్యుడిషియ‌ల్ రిమాండ్ కు పంపి.. అనంత‌రం విచార‌ణ‌కు అదుపులోకి తీసుకోవాల‌న్న యోచ‌న‌లో పోలీసులు ఉన్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఎట్టి ప‌రిస్థితుల్లో ర‌విప్ర‌కాశ్ అరెస్ట్ ఖాయ‌మ‌ని.. అనుకోని అవాంత‌రాలు ఎదురైతే త‌ప్పించి ఆయ‌న అరెస్ట్ జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News