హైదరాబాద్ మసీదులో విదేశీయులు.. అరెస్ట్

Update: 2020-04-07 12:50 GMT
దేశమంతా కరోనా తగ్గిపోయిన నేపథ్యంలో ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలతో మళ్లీ కరోనా కల్లోలం మొదలైంది.  ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా సోకడంతో  ఒక్కసారిగా దేశంలో కేసులు పెరిగాయి. దేశంలో దాదాపు రెట్టింపయ్యాయి.  

విదేశాల నుంచి వచ్చిన కొందరు మత ప్రబోధకులు కరోనాను వెంటపెట్టుకొని దేశంలోని జనాలకు అంటించారు. వీరు దేశంలోని కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులకు కరోనాను అంటించారు. నిబంధనలకు విరుద్ధంగా వీరు దేశంలో పర్యటించడంపై భారత ప్రభుత్వం పలు తీవ్రమైన కేసులు పెట్టింది. దీంతో భయంతో వీరంతా పలు ప్రాంతాల్లో రహస్యంగా తలదాచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో పలువురు విదేశీయులు తలదాచుకున్నట్టు తెలిసింది. తాజాగా మంగళవారం వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీలో మతప్రార్థనలు చేసిన మలేషియాకు చెందిన వ్యక్తులు రహస్యంగా హైదరాబాద్ నగరంలోని మసీదులో తలదాచుకున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందిన సమాచారంతో బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని రహస్యంగా దాక్కున్న ఆరుగురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

మలేషియా నుంచి వచ్చిన వీరంతా పర్యాటక వీసాలపై భారత్ కు వచ్చి నిజాముద్దీన్ మసీదులో ప్రార్థనల్లో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు.  ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఫిలింనగర్ సమీపంలోని హకీంపేట లో మసీదులో తలదాచుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని గాంధీ ఆస్పత్రి తరలించి పరీక్షలు చేశారు.రిపోర్టులు వస్తేకానీ వీరికి కరోనా ఉందో లేదో తెలియదు.


Tags:    

Similar News