ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా అందరికి ఇట్టే తెలిసిపోయే పరిస్థితి. అందులోకి యూట్యూబ్ తో జరిగిన వాటిని యథాతధంగా వీడియో రూపంలో షూట్ చేసి మరీ అప్ లోడ్ చేయటంతో.. మాటల్లోనూ.. పదాల్లోనూ చెబితే ఏ మాత్రం నమ్మలేని విషయాల్ని నమ్మించేస్తున్నాయి. ఒక చిన్నపిల్లాడు బాద్యతరాహిత్యంతో ఇంట్లో వారికి తెలీకుండా బైక్ వేసుకొని.. పోలీసులకు పట్టుబడిన వైనం.. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ పిల్లాడు సదరు సీఐను బతిమిలాడిన వైనం చూస్తే.. పోలీసులు ఎప్పుడేం చేయాలన్న విషయాన్ని ఇట్టే అర్థమయ్యేలా చేయటమే కాదు.. సదరు సీఐను అర్జెంట్ గా అభినందించాలనిపించటం ఖాయం.
ఇంతకీ ఎవరా సీఐ? ఆయనేం చేశారు? అసలేం జరిగింది? అన్న విషయాల్లోకి వెళితే.. ఏలూరుకు చెందిన సీఐ బంగార్రాజు ఈ మధ్యన రాత్రివేళ గస్తీ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఏడో తరగతి చదివే ఓ పిల్లాడు బైక్ నడుపుతుండటంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన ఘన కార్యాన్ని ఇంట్లో వారికి చెప్పేస్తే.. తన సంగతి ఇంకేమైనా ఉందా? అంటూ భయపడిపోయిన ఆ కుర్రాడు పెద్ద ఎత్తున ఏడ్చేస్తూ.. సీఐను బ్రతిమిలాడిన వైనాన్ని షూట్ చేశారు.
ఈ సందర్భంగా ఆ పిల్లాడి ఫేస్ ఏ మాత్రం కనిపించకూడదంటూ సీఐ..వీడియో షూట్ చేసే వారికి చెప్పటం వీడియోలో కనిపిస్తుంది. కౌన్సిలింగ్ తరహాలో ఆ పిల్లాడిని డీల్ చేసిన పద్దతి.. చేసిన తప్పును ఒప్పేసుకుంటూ.. తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే.. ఊరుకోరని.. తన తండ్రి అయితే చంపేస్తాడంటూ దీనంగా వేడుకోవటం కనిపిస్తుంది. అయితే.. పిల్లాడ్ని డీల్ చేసే విషయంలో సీఐ జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. అనునయంగా మాట్లాడిన వైనంతో పాటు.. చిన్న వయసులో బైకు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్న మాటను చెబుతూ.. ఆ తర్వాత ఆ పిల్లాడ్ని వదిలేసిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. తాజా ఏపిసోడ్ తో ఏలూరు సీఐ పలువురి మనసుల్ని దోచుకున్నారని చెప్పక తప్పదు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/