హత్రాస్ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా ఊపేస్తోంది. ప్రజలు, ప్రజా సంఘాలు రోడ్లపైకి వచ్చి దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు సామూహికంగా అత్యాచారం చేశారు. అత్యాచార సమయంలో తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. మెడపై గాయాలు చేయడంతోపాటు వెన్నుపూసను విరి చేశారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
హత్యాచార సంఘటన నిర్భయ, దిశ ఉదంతంలా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు బాధిత కుటుంబానికి కనీసం మృతదేహాన్ని అప్పగించకుండా రాత్రికి రాత్రే కాల్చి వేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు ఇచ్చింది. మరోవైపు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను నోయిడా లోని యమునా హైవే ఎక్స్ ప్రెస్ వే వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
కార్యకర్తలతో కలసి కాలినడకన వెళ్లాలని ప్రయత్నించగా..పోలీసులు అడ్డగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ' పోలీసులు తమపై లాఠీఛార్జి చేశారని, తనను కింద పడేశారని రాహుల్ గాంధీ చెప్పారు. రోడ్డుపై ప్రధాని మోదీ మాత్రమే నడవాలా.. సామాన్యులు ఎవరూ నడవొద్దా ' అని ప్రశ్నించారు. పోలీసులతో రాహుల్ వాగ్వాదానికి దిగడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కాగా పోలీసుల తోసివేతతో కొందరు కాంగ్రెస్ నాయకుల బట్టలు కూడా చిరిగిపోయాయి.
చిరిగిన కాంగ్రెస్ నేతల దుస్తులు
ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమిత్రా ధావన్ బట్టలు చింపేసినట్లు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోను ఆదేశ్ రావల్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అయి పోలీసుల తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. అగ్ర నాయకులపై అమానుషంగా ప్రవర్తించడంతో పాటు బట్టలు చిరిగేలా తోపులాట, లాఠీఛార్జ్ నిర్వహించారని మండి పడుతున్నారు.