ఉద్యోగం పేరిట 12 కోట్లు తీసుకున్న నూతన్!?

Update: 2020-09-14 17:00 GMT
దళిత యువకుడికి శిరోముండనం కేసులో బిగ్ బాస్ సెలెబ్రెటీ, దర్శకుడు నూతన్ నాయుడుతోపాటు ఆయన భార్య పీకల్లోతు ఇరుక్కుపోయారు. ఇప్పటికే వీరిద్దరూ అరెస్ట్ అయ్యారు. భార్య ప్రియను కాపాడబోయి ఏపీ సీఎంవో కార్యదర్శి పీవీ రమేశ్ పేరుతో ఫోన్ చేసి నూతన్ కూడా ఈ కేసులో ఇరుక్కున్నాడు.

అయితే నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యాక ఇప్పుడు అతడి బాగోతాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా నూతన్ మరో మోసం వెలుగుచూసింది.

ఉద్యోగం పేరిట నూతన్ నాయుడు 12 కోట్ల రూపాయలను వసూలు చేశాడని ఆరోపిస్తూ మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్.బీ.ఐలో రీజినల్ డైరెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి 12 కోట్లు వసూలు చేశాడని ఒక వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన విశాఖ డీసీపీ ఐశ్వర్య రస్తోగి ఫిర్యాదుపై లోతైన విచారణ జరుపుతున్నట్టు తెలిపింది. ఇప్పటికే సీఎం స్పెషల్ సెక్రెటరీ పీవీ రమేశ్ పేరుతో పైరవీలు చేయడంపై కంచరపాలెం, గోపాలపట్నం, గాజువాక పోలీస్ స్టేషన్లలోనూ నూతన్ పై కేసులు నమోదయ్యాయి.

కాగా నూతన్ అరెస్ట్ కావడంతో ఇన్నాళ్లు అతడి వల్ల ఇబ్బందులు పడ్డ వారంతా ఇప్పుడు గళం విప్పుతున్న్టటు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖలో వివిధ పోలీస్ స్టేషన్లలో నూతన్ పై 8 కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. బాధితులు మరింతమంది వస్తున్న నేపథ్యంలో నూతన్ పై మరిన్ని కేసులు పెట్టడానికి పోలీసులు రెడీ అయ్యారు.
Tags:    

Similar News