నిజమే.. మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. నాణెనికి ఇదో వైపు మాత్రమే. మరోవైపు.. ఇప్పటికైనా సరైన నిర్ణయాన్ని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీసుకుందని సంతోషిస్తున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కాకుంటే.. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు.. ఆందోళనలు చేస్తున్న వారికి దక్కుతున్న మీడియా ప్రచారం.. అనుకూలంగా నిర్వహించే కార్యక్రమాల మీద పెద్దగా ఫోకస్ చేయని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఈ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనల్లో కొందరు విదేశీయులు పాల్గొనటం చర్చగా మారుతోంది. దేశానికి టూరిస్టులు గా వచ్చిన వారు.. చదువుకోవటానికి వచ్చినోళ్లు.. ఇలా కొందరు ఈ నిరసనల్లో పాల్గొని కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టుకుంటున్నారు. కోల్ కతాకు చెందిన పోలాండ్ విద్యార్థి ఒకరు స్థానిక వర్సిటీ లో చదువుకుంటూ.. నిరసనల్లో పాల్గొన్న వైనంపై అధికారులు తీవ్రంగా స్పందించారు.
అతడ్ని దేశం విడిచి వెళ్లి పోవాలంటూ నోటీసులు జారీ చేయటం చర్చనీయాంశంగా మారింది. పోలాండ్ కు చెందిన కమిల్ అనే వ్యక్తి విద్యార్థి వీసా మీద జాదవ్ పూర్ వర్సిటీలో చదువుకుంటున్నాడు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల్లో అతగాడు పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు మీడియాలో వచ్చాయి. మోడీ సర్కారు నిర్ణయాన్ని తప్పు పడుతూ అతడు చేసిన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యం లో.. ఇతగాడి తీరును తప్పు పడుతూ కొందరు విదేశాంగ శాఖకు కంప్లైంట్లు ఇచ్చారు. దీంతో అతగాడికి ఎఫ్ఆర్ఆర్ వో నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. తమ కార్యాలయానికి పిలిపించిన విదేశాంగ కార్యలయం.. అతడ్ని పదిహేను రోజుల్లో దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశించినట్లుగా జేయూ వర్గాలు వెల్లడించాయి.
దీన్ని విద్యార్థి సంఘాలు తప్పు పడుతున్నాయి. చదువుకోవటానికి దేశానికి వచ్చిన వ్యక్తి ఇలాంటి నిరసనల్లో పాల్గొనటం ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం లేదు. ఇదిలా ఉంటే.. కమిల్ తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు కూడా ఆందోళనల్లో పాల్గొనటం.. తదనంతరం నోటీసులు అందుకున్న నేపథ్యంలో.. తాము భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయమని లేఖ రాసిచ్చినట్లు చెబుతున్నారు. మరి.. ఈ విదేశీ విద్యార్థులపై విదేశాంగ కేంద్ర కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంటగా మారింది.