నాయకులంతా 2024 ఎన్నికలు సమాయత్తం అవుతున్నారు. రాష్ట్రాలు ఎన్నికలకు ముందొస్తుగా వెళ్తాయా? టైమ్ కే నిర్వహిస్తారా? అన్నది తెలియదుగానీ ఈసారి ఎన్నికలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో యుద్ద వాతావరణన్నే తలపిస్తాయి. బయటకు కనిపించకపోయినా? టాలీవుడ్ లోనూ పోలిటికల్ హీట్ గట్టిగానే కనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాలతో పాటు ..రాజకీయాలు చేస్తోన్న నేపథ్యంలో ఇండస్ట్రీ లో రాజకీయ వేడి సహజమే.
అలాగే రాజకీయాలతో తనకెలాంటి సంబంధం లేకపోయినా సంచలనాల రాంగోపాల్ వర్మ రాజకీయ నాయకుల కథల్ని తెరకెక్కించి పరోక్ష కారకుడిగా రాజకీయ వేడిలో ఇముడుతున్నారు. ఈ ముగ్గురు 2024 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తారని గుస గుస వినిపిస్తుంది. ఇప్పటికే వర్మ వ్యూహం..శబదం అంటూ రెండు సినిమాలు ప్రకటించారు.
రెండు రాజకీయ నేపథ్యంతో కూడిన కథలే. పాత్రలకు డైరెక్ట్ గా పేర్లు పెట్టడు గానీ..పరిశ్రమ..రాజకీయం రెండింటినీ లింకప్ చేస్తారాయన. ఆయన సినిమాలు అధికార పార్టీకి మద్దతుగా ఉంటాయి అన్న విమర్శ ఉండనే ఉంది. ఈనేపథ్యంలో 2024 ఎన్నికలకు ముందే వర్మ ప్రకటించిన సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో `భవదీయుడు భగత్ సింగ్` ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది పొలిటికల్ సెటైరికల్ స్టోరీ అని సమాచారం. 2024 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పవన్ ప్రీ ప్లాన్ డ్ గా కథ సిద్దం చేయించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ డిసెంబర్ లోనే సినిమా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ కథ వెనుక మాటల మాత్రికుడు త్రివిక్రమ్ కూడా ఉన్నాడని సమాచారం. అవసరమైన ఇన్ పుట్స్ ని త్రివిక్రమ్ ..హరీష్ కి అందించాడని వినిపిస్తుంది.
ఈ చిత్రాన్ని సరిగ్గా ఎన్నికలకు ముందు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. అలాగే పవన్ టైటిల్ తో కొన్ని పొలిటికల్ సెటైరికల్ టైటిల్స్ కూడా రిజిస్టర్ అయ్యాయి. అవి పూర్తిగా పవన్ కి మద్దతుగా తెరకెక్కించే సినిమాలు. ఇక నటసింహ బాలకృష్ణ-బోయపాటి కూడా ఎన్నికల నేపథ్యంలో ఓ పోలిటికల్ స్టోరీ తో వచ్చే అవకాశం ఉందని సమాచారం.
సహజంగా బోయపాటి సినిమాల్లో పొలిటికల్ టచప్ ఉంటుంది. అందులోనూ బాలయ్య హీరో అయితే? ఇంకాస్త అదనంగా పవర్ ఫుల్ గా కథని మలుస్తారు. ఎన్నికలకు ముందు ఈ కాంబో సినిమా రిలీజ్ ఖాయమంటున్నారు. గతంలో పీకే..బాలయ్య..వర్మ సినిమాలు ఎన్నికల ముదు రిలీజ్ అయిన సందర్భాలున్నాయి. అప్పుడు రాజకీయాల్లో ఆ ఇద్దరు అంత యాక్టివ్ గా లేరు. ఈ సారి సన్నివేశం అందుకు భిన్నంగా ఉంది. రాజకీయ ఎజెండాతోనే ముందుకు కదులుతోన్న నేపథ్యంలో ఇద్దరి స్టార్ల సినిమాలు ఆసక్తికరమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.