ఇటీవల కాలంలో తీవ్ర చర్చగా మారిన పొలిటికల్ పంచ్ ఆడ్మిన్ రవికిరణ్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తానేటి అనిత ఇచ్చిన ఫిర్యాదుతో రవికిరణ్ పై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. దళిత ఎమ్మెల్యేను కించపరిచేలా పోస్టింగ్ లు పెట్టిన వైనంపై ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఏప్రిల్ 19న రవికిరణ్ పై ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. ఆ మధ్య మంత్రి లోకేశ్ పై పెట్టిన పోస్టింగ్ పై ఏపీ పోలీసులు రియాక్ట్ అయి.. ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించటం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు రవికిరణ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు.. తాజాగా ఆయన్ను అరెస్ట్ చేయటం గమనార్హం. రవికిరణ్ అరెస్ట్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఇన్ ఛార్జ్ చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతిని.. వైఫల్యాల్ని సోషల్ మీడియా ద్వారా వ్యంగ్యంగా ప్రశ్నించినందుకే రవికిరణ్ ను అరెస్ట్ చేశారన్నారు.