సుదీర్ఘ కాలం పాటు సాగిన పోలింగ్ వ్యవహారం ముగిసింది. దాదాపు రెండు నెలల పాటు సాగిన పోలింగ్ సిత్రంలో.. ఏడో విడత పోలింగ్ ఈరోజునే పూర్తి అయ్యింది. మొదటి దశ నుంచి ఏదో దశ వరకూ చూస్తే.. పోలింగ్ నమోదైన శాతాల్లో వ్యత్యాసాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి.
ఆరంభం అదిరేలా పోల్ పర్సంటేజీలు నమోదైనా..తర్వాత అంతకంతకూ తగ్గటం కనిపిస్తుంది. మొదటి దశతో పోలిస్తే రెండో దశ.. ఆ తర్వాతి దశ మరింత తగ్గుతూ ఓట్ల శాతం నమోదైంది. ఇది ఐదో విడత వరకూ సాగగా.. ఆరో విడతలో మాత్రం కాస్త ఎక్కువగా ఓట్లు పోల్ అయ్యాయి. అనూహ్యంగా ఏడో శాతం అంతకు ముందు జరిగిన మూడు విడతల కంటే ఎక్కువగా నమోదు కావటం విశేషం.
తొలి.. రెండు విడతల్లో 69 శాతం పోలింగ్ నమోదు అయితే.. మూడో విడత కాస్త తగ్గుముఖం పట్టి 68 శాతం చిల్లరకు పరిమితమైంది. నాలుగో విడతలో 65.5 శాతం కాగా.. ఐదారు విడతలు 64 శాతానికి పరిమితమయ్యాయి. ఏడో దశలో మళ్లీ పుంజుకొని 67 శాతం ఓట్లు నమోదయ్యాయి.
అత్యధికంగా పోల్ జరిగిన విడత తొలి విడత కాగా.. అత్యల్పంగా పోలింగ్ జరిగింది ఐదో విడత కావటం గమనార్హం. మొత్తంగా జరిగిన ఏడు దశల పోలింగ్ శాతాల్ని సరాసరి చేస్తే.. ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం 66.97 శాతంగా చెప్పాలి. అంటే.. వంద మందికి ఓట్లు ఉంటే.. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పింది 67 మంది మాత్రమే.
తొలి విడత: 69.61 శాతం
రెండో విడత: 69.44 శాతం
మూడో విడత: 68.40 శాతం
నాలుగో విడత: 65.50 శాతం
ఐదో విడత: 64.16 శాతం
ఆరో విడత: 64.40 శాతం
ఏడో విడత: 67.34 శాతం (ఈరోజు.. ఆదివారం)
+ అన్ని విడతల్లో నమోదైన పోలింగ్ శాతాల్ని సరాసరి చేస్తే.. 66.97 శాతమైంది.