జగన్.. బాబుల బలాన్ని చెప్పే అంకెలివి

Update: 2017-03-22 04:31 GMT
చేతిలో అధికారం ఉంటే పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకోవటం పెద్ద విషయం కాదు. అందుకు సాక్ష్యంగా ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్ని చెప్పొచ్చు. స్థానిక సంస్థలకు జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ విజయం సాధించిందంటూ తెలుగు తమ్ముళ్లు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జగన్ కోటలో తాము పాగా వేసినట్లుగా ఫీల్ అవుతూ మురిసిపోతున్నారు. చేతిలో పవర్.. దాదాపు రూ.125కోట్లకు పైగా ఖర్చు చేస్తేనే విజయం సాధ్యమైందన్న అసలు విషయాన్ని వారు చెప్పకోలేని పరిస్థితి.

మరింతగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన తర్వాత అయితే.. పడిన ఓట్లు.. వచ్చిన మెజార్టీ ఏమైనా ఉందా?అంటే.. ఏమీ లేదని చెప్పాలి. 2014లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాల్ని.. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల్ని.. గెలిచిన పార్టీకి వచ్చిన మెజార్టీలను చూస్తే  చంద్రబాబు అసలు బలం ఎంతన్నది ఇట్టే అర్థమైపోతుంది.

2014లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జిల్లాల వారీగా సాధించిన మెజార్టీ.. తాజాగా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు లబించిన మెజార్టీలను చూస్తే.. ఎవరి బలం ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది.

2014లో జగన్ పార్టీ అభ్యర్థికి నెల్లూరు జిల్లలో 95 ఓట్ల మెజార్టీ వస్తే.. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ 87 మాత్రమే. ఇక.. కర్నూలు జిల్లాలో 2014లో జగన్ పార్టీకి వచ్చిన మెజార్టీ 77 ఓట్లు కాగా..తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి లభించిన మెజార్టీ 62ఓట్లు మాత్రమే. ఇక కడప జిల్లాలో 2014లో జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ అభ్యర్థికి 218 ఓట్ల మెజార్టీ రాగా.. తాజా ఎన్నికల్లో భారీగా అవినీతి అక్రమాలకు.. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఆరోపణల అనంతరం వచ్చిన మెజార్టీ కేవలం38 ఓట్లు మాత్రమే కావటం గమనార్హం. ఈఅంకెలు చాలు.. బాబు రియల్ బలం ఏమిటో అర్థం చేసుకోవటానికి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News