మహాకూటమి ఎఫెక్ట్ కాంగ్రెస్ సీనియర్ నేతలపై కూడా పడుతోంది. వారి టికెట్లకు కూడా ఎసరు వస్తోంది. కూటమి పొత్తుల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీటు కూడా గల్లంతు అవుతుందోనన్న టెన్షన్ ఆయన్ను వెంటాడుతోంది.
పొన్నాల వరంగల్ పూర్వపు జిల్లాలోని జనగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చాలా ఏళ్లుగా పోటీ చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం ఉన్న టీఆర్ ఎస్ అభ్యర్థిపై తీవ్ర విమర్శలు - వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పొన్నాల ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏర్పడింది. జనగాం సీటును కోదండరాం కోరుతున్నారట.. జనసమితి అధ్యక్షుడు కావడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏం మాట్లాడని పరిస్థితి నెలకొంది.
జనగామ జిల్లా సాధన కోసం కోదండరాం జేఎసీ తరఫున అలుపెరగని పోరాటం చేశాడు. ఆ సమయంలో యువత, ఉద్యోగులు కోదండరాంకు మద్దతుగా నిలిచారు. అందుకే కోదండరాం జనగామ నుంచి పోటీచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట.. ఈ పరిస్థితులన్నీ హైకమాండ్ దగ్గర చర్చకు వచ్చాయి. దీంతో పొన్నాలకు సీటు డౌటే అన్న ప్రచారం జరుగుతోంది. పొన్నాలకు ఈ మేరకు ఢిల్లీ నుంచి కూడా సంకేతాలు అందినట్టు సమచారం.
గడిచిన రెండు రోజులుగా ఇంటికే పరిమితమైన పొన్నాల ఈ ఉదయం చెర్యాల మండలంలో ప్రచారం ప్రారంభించారు. పొన్నాలకు సీటు రాకపోతే ఊరుకోమంటూ ఆయన అనుచరులు, నాయకులు గళం వినిపిస్తున్నారు. పీసీసీ మాజీ చీఫ్ కే టికెట్ లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఢిల్లీలోని సీనియర్లతో కూడా పొన్నాల మాట్లాడి స్పష్టమైన హామీని తెచ్చుకున్నారట.. దీనిపై అధిష్టానం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
అయితే పొన్నాలకు భువనగిరి ఎంపీ సీటు ఇస్తామని.. జనగామ వదులుకోవాలని అధిష్టానం బుజ్జగింపులు చేస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. దీనిపై అటు పొన్నాల, ఇటు కాంగ్రెస్ అధిష్టానం స్పందించలేదు. మరో రెండు రోజులు గడిస్తే కానీ పొన్నాల పరిస్థితి ఏంటో తెలియలేదు..