పొన్నాల వ్యాసాలు.. రైల్వే పోర్టర్ రెస్పాన్స్ తెలిసిందా?

Update: 2016-03-30 07:17 GMT
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించటమే కాదు.. 2014 ఎన్నికల్ని బాధ్యతల్ని చేపట్టి.. ఘోరంగా విఫలమైన పొన్నాల లక్ష్మయ్య గుర్తున్నారా? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సాగించిన పదేళ్ల పాలనలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నాల గత కొద్దికాలంగా కనిపించటం లేదనే చెప్పాలి. తాజాగా.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన అసెంబ్లీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయి.. ఇరిగేషన్ మీద తెలంగాణ అధికారపక్షం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని సిద్దం చేసేందుకు.. పార్టీ నేతలతో భేటీ అయ్యేందుకు అసెంబ్లీకి వచ్చారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తన మాటల్లో ఒక ఆసక్తికర విషయాన్ని పొన్నాల చెప్పుకొచ్చారు. తానీ మధ్య ఒక దినపత్రికకు ఇరిగేషన్ కు సంబంధించి తెలంగాణప్రభుత్వం చేపట్టిన అంశాల్ని విమర్శిస్తూ ఒక వ్యాసం రాశానని.. దానికి కౌంటర్ గా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు కౌంటర్ గా వ్యాసం రాశారన్నారు.

తనకు కాజీపేట రైల్వే పోర్టర్ ఒకరు ఈ మధ్యన కలసినప్పుడు.. తన వ్యాసం బాగుందని మెచ్చుకోవటమేకాదు.. విద్యాసాగర్ రావు రాసిన వ్యాసం కూడా చదివానని.. అందులో పస లేదని చెప్పినప్పుడు తనకెంతో సంతోషం కలిగిందని చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ రంగానికి సంబంధించి మేధావిగా పేర్కొనే వ్యక్తి కంటే తన వ్యాసాలు బాగున్నాయని ఒక సామాన్యుడు కితాబు ఇస్తే పొన్నాలకు సంతోషం ఉండదా ఏంటి?
Tags:    

Similar News