ఆంధ్రప్రదేశ్ శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై ఇటీవల రేగిన దుమారం తెలిసే ఉంటుంది. ఓ టీవీ ఛానల్ లో ఆయన మాట్లాడుతూ తను ఎమ్మెల్యేగా గెలిచేందుకు గతంలో కంటే పెద్ద ఎత్తున ఖర్చు చేశానని చెప్పుకొచ్చారు. ఆ ప్రకటన ఆధారంగా ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు చేయడం - కోర్టుకు వెళ్లడం తెలిసిందే. ఇపుడు అదే తరహా బాల్కొండ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. గత ఎన్నికల్లో - తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశాననంటూ బహిరంగంగా ప్రకటించడంతో ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.
మాజీ ఎంపీ - టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన వీడియోని ప్రదర్శించి చూపించారు. అందులో ప్రశాంత్ రెడ్డిని గ్రామ ప్రజలు చెక్ డ్యామ్ కావాలని నిలదీశారని, రెండున్నరేళ్లుగా అడుగుతున్నా పట్టించుకోకపోవడంతో ప్రజలు నిరసన వ్యక్తం చేశారని పొన్నం వివరించారు. దీనికి ప్రశాంత్ రెడ్డి తాను ఏసీ లేకుండా కదలనని - ఇంట్లో - ఆఫీస్ - కారు ఇలా ఎక్కడున్నా ఏసీలో ఉంటానని, తనను అడ్డుకున్న వారు వంద సార్లు హైదరాబాద్ చుట్టూ తిరిగినా తాను పనులు చేయనని చెప్పడం సిగ్గుచేటని పొన్నం మండిపడ్డారు. ఇది ప్రజా ప్రతినిధిగా ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడమే అవుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్లాది రూపాయలు ఎవరికి ఇచ్చారో, ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారో ప్రశాంత్ రెడ్డి ప్రకటించాలని పొన్నం డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మంత్రులు - టీఆర్ ఎస్ నాయకుల ఆగడాలు ప్రజలు భరించలేకుండా ఉన్నారని పొన్నం వ్యాఖ్యానించారు. మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరుడు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమాయకుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేశాడని ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేయడమే కాకుండా అడిగిన అమాయకులను చితకబాదారని పొన్నం చెప్పారు. ఈ విషయంలో టీఆర్‌ఎస్ నేతలకు చిత్తశుద్ది ఉంటే జగదీశ్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ అధికారులు టీఆర్‌ఎస్ నేతల మాటలు వినకపోతే రాజీనామా చేయిస్తామని బెదిరిస్తున్నారని, తెలంగాణలో దౌర్జన్య పూరితమైన పాలన సాగుతోందని పొన్నం మండిపడ్డారు. ముఖ్య మంత్రికి ప్రజల బాగోగులపై చిత్తశుద్ది ఉంటే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/