కాస్త ఆవేశంగా మాట్లాడతారనే కానీ తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన పాయింట్లు లేవనెత్తుతారు. మూర్తీభవించిన తెలంగాణ వాదంతో వ్యవహరించే ఆయన.. రాజకీయంగా కేసీఆర్ ను అమితంగా ద్వేషిస్తారు. కాంగ్రెస్ కు వీర భక్తుడిగా వ్యవహరించే ఆయన.. అవకాశం చిక్కిన ప్రతిసారీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడుతుంటారు. తాజాగా మరోసారి అదే తీరులో విరుచుకుపడ్డారు.
ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలన్నింటిని తీర్చేసినట్లుగా చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పిన పొన్నం ప్రభాకర్.. ఏ మాటకు ఆ మాటే అన్న చందంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో నెరవేర్చిన వాటి గురించి కూడా చెప్పుకొచ్చారు. ఆసరా ఫించన్లు తప్పించి మరే అంశం మీద కూడా కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని మండిపడ్డారు.
కరీంనగర్ లో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి రెండున్నరేళ్లు అవుతుందని.. ఇప్పటివరకూ ఆ హామీని అమలు చేసింది లేదన్న పొన్నం.. ఇచ్చిన హామీల్ని అమలు చేయని పక్షంలో ముఖ్యమంత్రి.. మంత్రుల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విపక్ష పార్టీ నేతల్ని ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ పార్టీలను.. ప్రజాసంఘాల్ని ఆహ్వానించకపోవటంపై కేసీఆర్ వివరణ ఇవ్వాలని పొన్నం డిమాండ్ చేశారు.
నిజమే.. చరిత్రాత్మకమైన జిల్లాల ఏర్పాటు కార్యక్రమాలకు రాజకీయ పక్షాలన్నింటిని భాగస్వామ్యం చేయటంతో పాటు.. ప్రజా సంఘాల్ని కూడా ఆహ్వానిస్తే.. కార్యక్రమం మరింత శోభనిచ్చేది కదా. పండగ అందరికి పండగే కదా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/